ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై, వైసిపీ నేతలు దాడి చేస్తూనే ఉన్నారు. గతంలో నిమ్మగడ్డ కూతురుని కూడా బయటకు లాగి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అయితే, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూనే ఉన్నారు. కొడాలి నాని లాంటి మంత్రులు బొచ్చు పీకుతాడా, చంద్రబాబు బూట్లు నాకుతాడు అంటూ దారుణమైన భాష వాడారు. వారు తాము మంత్రులం అని కూడా మర్చిపోయారు. ఏదైనా రాజ్యాంగ పదవిలో ఉన్న వారి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హేయం. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా, ఇలా చేస్తున్నారు అంటే, ఇక ఆ స్థానానికి అర్ధమే ఉండదు. మంత్రి బొత్సా మాట్లాడుతూ, నిమ్మగడ్డ, చంద్రబాబు డీఎన్ఏ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేసారు. దీని అర్ధం తెలిసి మాట్లాడారో, తెలియక మాట్లాడారో బొత్సా గారికే తెలియాలి. ఇక మంత్రి పెద్దిరెడ్డి అయితే, నిమ్మగడ్డ, మా ఇంట్లో ఎడ్లతో సమానం అంటూ హేయమైన భాష వాడారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే, ప్రతి రోజు నిమ్మగడ్డని తిడుతూ ఒక అరగంట ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే రాజకీయం వేరు, ప్రభుత్వంలో ఉంటూ, ఒక రాజ్యాంగ సంస్థ పై, ఇలా బూతులుతో విరుచుకుపడటం వేరు. అందుకే, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ తన పవర్ ఏమిటో చూపిస్తున్నారు.

sajjala 29012021 2

ఈ విషయాల పై ఇప్పటికే నిమ్మగడ్డ, పలుమార్లు గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మీ మంత్రులను అదుపులో ఉంచాల్సిందిగా కోరారు. గవర్నర్ కూడా తగు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ రోజు ఎలక్షన్ కమీషనర్ ఒకింత ఘాటుగానే గవర్నర్ కు లేఖ రాసారు. తన రాజ్యాంగ పరమైన హక్కులు హరిస్తూ, వారు తన పై ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు అని, తాను చివరి ప్రయత్నంగా మీ వద్దకు వచ్చానని, లేదంటే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అంటూ, గవర్నర్ కు లేఖ రాసారు. మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పై అభ్యంతరం చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రధాన సలహాదారుగా ఉంటూ, ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ, సజ్జల పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ లు పెట్టి, దుషిస్తున్నారని, సజ్జలని ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా దూషిస్తున్నారని ఫిర్యాదు చేసారు. న్యాయ సలహాలు తీసుకుని, వీరి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిజానికి కోర్టుకు వెళ్దాం అనుకున్నా, చివరి ప్రయత్నంగా మీ వద్దకు వచ్చానని, గవర్నర్ కు రాసిన లేఖలో తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read