ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిది వింత వింతగా జరుగుతుంది. ప్రభుత్వం ఏమి చెప్తే అది చేయాల్సిందే. దానికి రూల్స్ ఉండవు, నిబంధనలు ఉండవు, అంతా మేము చెప్పినట్టే చేయాలనే ధోరణిలో పెద్దలు ఉంటున్నారు. తాము ఏమి చెప్తే అది చేయాల్సిందే, మీ చావు మీరు చావండి అనే ధోరణి రోజు రోజుకీ ఎక్కువ అయిపోతుంది. తప్పక చేసే వారు కొందరు అయితే, తమ చేతిలో లేనిది మేము ఏమి చేయలేం అనే వారు మరి కొందరు. ఇది కాస్త శ్రుతిమించి, మేము చెప్పినట్టు చేయాల్సిందే, మాకే ఎదురు తిరుగుతారా అనే విధంగా, ఏకంగా రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్, న్యాయమూర్తులు, మండలి చైర్మెన్ లాంటి వారి పై కూడా వెళ్ళిన పరిస్థితి చూసాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే చర్చకు దారి తీసింది. ఏకంగా కేంద్రం మంత్రి ఫోన్ చేసి, ఏమి జరుగుతుంది అంటూ హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. విషయానికి వస్తే, ప్రభుత్వం చెప్పినట్టు లోన్ లు ఇవ్వలేదు అంటూ నిన్న కృష్ణా జిల్లా వ్యాప్తంగా, కొన్ని బ్యాంకుల ముందు చెత్త పారపోసి, ఇవి కమీషనర్ పారబోయమన్నారు అంటూ, ఏకంగా బోర్డులు ఏర్పాటు చేసిన సంఘటనతో అందరూ ఉలిక్కి పడ్డారు. విజయవాడ, ఉయ్యూరు, బందర్ లో, కొన్ని బ్యాంకులు ముందు ఇలా చెత్త పోసి, మేము రుణాలు అడిగితే ఇవ్వరా, అందుకే ఈ నిరసన అంటూ బోర్డులు కూడా పెట్టారు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, అవి మునిసిపల్ కమీషనర్ పేరుతో ధైర్యంగా ఏర్పాటు చేయటం.

niramala 25122020 2

అయితే బ్యాంకు అధికారులు, ఈ దుశ్చర్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. బ్యాంకు సిబ్బందికే కాక, బ్యాంకుకు వచ్చే ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తాయని, ఇలాంటి చర్యల పై ఆక్షన్ తీసుకోండి అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. దీంతో కలెక్టర్ ఫిర్యాదు చేయటంతో, కలెక్టర్ కలుగ చేసుకుని, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో, ఆ చెత్తను తీసేశారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభుత్వ చర్య పై, దేశ వ్యాప్తంగా కూడా చర్చుకు దారి తీసింది. కొన్ని జాతీయ చానల్స్ కూడా ఈ విషయం పై కధనాలు వేయటంతో, కేంద్రం కూడా స్పందిన్చింది. ముఖ్యంగా జాతీయ బ్యాంకులు ముందు ఇలా చేయటంతో, కేంద్ర ఆర్ధిక మంత్రి కలుగ చేసుకున్నారు. వెంటనే రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గనకు ఫోన్ చేసి, ఇలాంటి చర్యలు మంచిది కాదని హితవు పలికారు. మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా చూస్తానని, బుగ్గన చెప్పినట్టు స్వయంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె ఈ విషయం పై తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. మరి ప్రభుత్వం, ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read