యువతరమే ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా, కుటుంబానికైనా వెన్నెముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే సమాజ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మనసా వాచా కర్మణా నమ్మి, ఎంతో దూరదృష్టితో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు.యువతకు ఆర్థిక, నైపుణ్య చేయూతనిచ్చి నిరుద్యోగులను ఉద్యోగార్ధులుగా చేసేందుకు రూపొందించిన పథకమే ముఖ్యమంత్రి యువనేస్తం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత మందికి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. భృతి ఇవ్వాల్సిన నిరుద్యోగుల సంఖ్య 12 లక్షల మంది వరకు ఉన్నట్లు సమాచారం.ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా ఉంటూ, వారి కష్టనష్టాలను తనవిగా భావించి వారి బాగుకోసం నిరంతరం కృషిచేస్తోన్న మన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రవేశ పెట్టిన ఈ యువనేస్తం పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులందరికీ నెల నెలా వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి పొందే అవకాశం కలుగుతోంది.

bruti 10092018

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుద్యోగ భృతి పథకాలు ప్రవేశపెట్టారు. నెలకు రూ.100 నుంచి రూ.500 వరకే ఇచ్చారు. ఏ రాష్ట్రంలోను 20 వేల మందికి మించి భృతి ఇవ్వలేదని.. అది కూడా విఫలమైందని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. కానీ నవ్యాంధ్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 12 లక్షల మందికి నెలకు రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.అర్హులైన వారందరికీ ఇది అందనుదని చెప్పారు. వెయ్య రూపాయలు తీసుకోవటమే కాదు.. నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఇందుకోసం దేశంలోని పలు పేరున్న పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కూడా తగిన శిక్షణా ఇస్తారు. ఈ నెల 14వ తేదీన ఈ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నాడు యువత బ్యాంకు ఖాతాలకు నేరుగా తొలి భృతి జమచేస్తారు.

bruti 10092018

ముఖ్య అంశాలు... 1.ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ.. 2.స్వయం ఉపాధి శిక్షణ మరియు స్వయం ఉపాధి కల్పన.. 3.అప్రెంటిస్ కార్యక్రమం...కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్ కార్యక్రమం అనుసంధానం ద్వారా ఆన్ జాబ్ ట్రైనింగ్.. 4.కాంపిటేటివ్ పరీక్షల కోసం శిక్షణ.. ఇప్పటి వరకూ కేవలం కొన్ని రాష్ట్రాలు గరిష్టంగా 20 వేల మందికి మాత్రమే భృతి ఇవ్వడానికి ప్రయత్నించి విఫలం అయ్యాయి...కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఎంత మంది అర్హులైన నిరుద్యోగులు ఉన్నా అందరికి ఈ కార్యక్రమం వర్తించేలా చర్యలు తీసుకున్నారు..

bruti 10092018

నిరుద్యోగ భృతికి అర్హతలేమిటి?... • మీ యొక్క వయసు 22సం నుండి 35 సం .ల మధ్య ఉండాలి.. • పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి అయ్యి ఒక సంవత్సరం అయి ఉండాలి.. • EPF మరియు ESIC కింద నమోదు చేసిన ప్రైవేట్ సంస్థలు, ఔట్ సోర్ సింగ్ / కాంట్రాక్టు ప్రాతిపదికిన పని చేస్తున్న యువత అర్హులు కాదు.. • తెల్ల రేషన్ కలిగి ఉండాలి.. • ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి..• మీ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు.. • ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి... • మీ కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.. • ప్రభుత్వం నుండి లోన్ /సబ్సిడీ రూ 50,000 మించి పొంది ఉండకూడదు... • గరిష్టంగా 2. 5 ఎకరాల మాగాణి భూమి, 5 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు • అనంతపురం జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5 ఎకరాల మాగాణి భూమి , 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు.. • మీ బ్యాంకు ఖాతా,మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుకు జతచేసి ఉండాలి .లేని యెడల వెంటనే మీ సేవ సెంటర్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ని సంప్రదించి మీ వివరాలను పొందుపరచండి... • తల్లిదండ్రులు / కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ, నిరుద్యోగ యువత యువనేస్తం కి అర్హులుగానే పరిగణించబడతారు... • శారీరక వికలాంగుల కోటా కింద పెన్షన్ పొందే వారికి అర్హత లేదు... • కుల,మత ప్రాధాన్యతలు నిబంధనల ప్రకారం అమలుచేయబడుతుంది.. •ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తొలగింపబడ్డ వారు కూడా అర్హులు కాదు.. •నేరస్థుడిగా శిక్షింపబడ్డవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.. •ఇతర రాష్ట్రాల విశ్వ విద్యాలయాల నుండి డిగ్రీలను పొందిన వారు కూడా అర్హులే.. యువనేస్తం పథకంలో నమోదు చేసుకోడానికి అవసరం అయ్యే వివరాలు,పత్రాలు... ఆధార్ కార్డు నెంబరు.. గ్రాడ్యు యేషన్ సర్టిఫికెట్

ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో నమోదు చేసుకోవడం ఎలా? 1. నిరుద్యోగ యువతీ యువకులు ముఖ్యమంత్రి యువనేస్తం కి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా http://yuvanestham.ap.gov.in అనే website కి వెళ్ళాలి.. 2. ఇప్పుడు Apply Now అనే బటన్ ని నొక్కాలి.. 3. ఇప్పుడు దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నంబర్ను enter చేయండి.. 4. ఇప్పుడు send OTP అనే బటన్ ని నొక్కండి.. 5. మీ ఆధార్ నెంబర్ కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కి OTP నెంబర్ పంపబడుతుంది... 6. మీ మొబైల్ కి వచ్చిన OTP ని OTP బాక్స్ లో టైప్ చేసి verify OTP బటన్ నొక్కండి... 7. ఒకవేళ OTP రానిచో రిసెండ్ OTP బటన్ నొక్కండి.. 8. మీ ఆధార్ కార్డు లో నమోదు అయిన వివరాలన్నీ స్క్రీన్ మీద ఒకసారి సరిచూసుకోండి... 9. ఒకవేళ అడ్రస్ వివరాలు మార్చాలి అనుకుంటే అప్ డేట్ అడ్రెస్ డీటైల్స్ అనే బాక్స్ ని సెలెక్ట్ చేసుకుని మార్చుకోవాలి. అదేవిదంగా అవసరమైతే మొబైల్ నెంబర్ ని కూడా edit అనే ఆప్షన్ ద్వారా మార్చుకుని OTP ద్వారా ద్రువీకరించుకోవాలి . మీరు జత పరిచిన మొబైల్ కు తగు సమాచారం పంపడం జరుగుతుంది.ఈ -మెయిల్ కూడా నమోదు చేసుకోవచ్చు.. 10. చివరిగా apply / continue బటన్ నొక్కాలి... 11. ఇప్పుడు మీ యొక్క అర్హత వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి.. 12. మీ యొక్క చదువు వివరాలను కూడా నమోదు చేసుకోవాలి. మీ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్ ని కూడా అప్లోడ్ చెయ్యాలి . చివరిగా మీ దృవీకరణను తెలియచేసి agree బటన్ ని నొక్కండి... 13. మీ యొక్క వివరాలు సరైనవి అయితే agree బటన్ సెలెక్ట్ చేసుకుని submit మరియు close బటన్ నొక్కండి... 14. మీరు యువనేస్తం కి అర్హత పొందినట్టు మీకు ఒక ప్రత్యేక కోడ్ స్క్రీన్ మీద వస్తుంది... 15. ఒకవేళ మీ వివరాలు సరైనవి కానిచో disagree బటన్ సెలెక్ట్ చేసి Grievance Registration బటన్ నొక్కి మీ సమస్యను నమోదు చేసుకోండి... 16. ఏదైనా సమస్య ఉంటే కాల్ సెంటర్ నెంబర్ 1100 ని సంప్రదించండి. అలాగే
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. అనే ఈ -మెయిల్ ద్వారా కూడా మీ సమస్యను తెలియచేయవచ్చు

నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ.. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు తమకు ఇష్టమైన మూడు రంగాలలో ఉద్యోగం పొందేందుకు అవసరమైన శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పించబోతుంది.అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని అనుసంధానం చెయ్యడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలి అని నిర్ణయం తీసుకుంది.దీని కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తం లో భాగస్వామ్యం చేస్తుంది.ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్ సైట్ ని సెప్టెంబర్ 14 న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు...అక్టోబర్ 2 నుండి యువత బ్యాంకు ఖాతాలకు భృతి నేరుగా చెల్లించనున్నారు.. మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు...గత రెండు నెలల్లోనే 36 సమీక్షా సమావేశాలు నిర్వహించారు...యువత ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవడం,నైపుణ్యాభివృద్ది,అప్రెంటిస్ ఇలా అన్ని మాడ్యూల్స్ ఆన్ లైన్ ద్వారా చేసుకునే విధంగా ఈ వెబ్ సైట్ ని రూపొందించారు.

ఇతర రాష్ట్రాలు కేవలం సరైన సమాచారం లేకపోవడం వలనే ఈ కార్యక్రమం విఫలం అయ్యింది అని గుర్తించిన మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలను అనుసంధానం చెయ్యడంలో కీలక పాత్ర పోషించారు.అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి నుండి సమాచారం సేకరించారు...వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ల తో సమావేశం అయ్యి అందరిని సహకరించాలి అని కోరారు... అంతే కాదు ఈ కార్యక్రమం అమలులో కీలకం అయిన అంశం పిఎఫ్,ఈఎస్ఐ డేటా ని కేంద్రం నుండి తీసుకురావడానికి ఢిల్లీ స్థాయిలో తనకి ఉన్న పరిచయాల ద్వారా త్వరితగతిన వచ్చేందుకు కీలకపాత్ర పోషించారు.. కేవలం ముఖ్యమంత్రి యువనేస్తం 1000 రూపాయిలు భృతి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం కాదు...యువత సరైన మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ అనేక శాఖల అనుసంధానంతో పూర్తి స్థాయి ఆన్ లైన్ వేదిక ని సిద్ధం చేసారు.ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు...భృతి కి అర్హులా కాదా అన్న విషయం తెలిసిపోతుంది.అక్కడి నుండి నైపుణ్యాభివృద్ది,అప్రెంటిస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇలా అన్ని ఆన్ లైన్ లో జరిగిపోయాయి...ఒక రకంగా ఇది ఎంప్లొయ్మెంట్ ఎక్స్చేంజ్ లా పనిచేస్తుంది...దేశంలో ఉన్న వివిధ కంపెనీలు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యి తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూకి పిలుచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read