ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద అందిస్తున్న నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇంకా అందలేదు. ప్రతి నెలా 1,2 తేదీల్లోపు నిరుద్యోగుల ఖాతాలో జమ అయ్యేవి. ఈ నెల 6వ తేది వచ్చిన ఇంతవరకు ఒక్కరి ఖాతాలో కూడా పడలేదు. టిడిపి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది అక్టోబరు 2వతేదీన గాంధీ జయంతి రోజున టీడీపీ ప్రభుత్వం యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న 22 నుంచి 35 సంవత్సరాల యువతీ, యువకులను ఈ పథకానికి ఎంపిక చేశారు. అర్హులైన వారికి నెలకు రూ.1000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుండేది. ఇప్పటివరకు ఏడు నెలలకు సంబంధించి ప్రతి లబ్ధిదారుడూ వెయ్యి రూపాయల చొప్పున అందుకున్నారు.

bruti 07062019

సార్వత్రిక ఎన్నికల ముందు నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000 పెంచుతున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ప్రకటించారు. అప్పటికి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఎంఎల్‌సీ ఎన్నికలు కోడ్‌ రావడంతో ఈ పెంచిన నిధులు నిలిచిపోయాయి. దీంతో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే జమ అవుతూ వస్తోంది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి మంజూరయ్యేది. ఈ పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల ఆ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆమోదం పొందలేదు. అభ్యర్థి ప్రైవేటు ఉద్యోగి అయి ఉన్నా.. ఆస్తులు ఉన్నా.. వయసు ఎక్కువున్నా భృతి మంజూరుకాలేదు. అనేకసార్లు గ్రీవెన్స్‌లో మొర పెట్టుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. చివరికి 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా అందలేదు.

bruti 07062019

ప్రతి నెలా రెండో తేదీ వస్తే చాలు ఠంచన్‌గా బ్యాంకు అకౌంట్‌లో రూ.1000 జమయ్యే యువనేస్తం సాయం ఆరురోజులైనా అందకపోవడంతో నిరుద్యోగులు నిరాశ పడుతున్నారు. అసలు ఇస్తారో..లేదోనని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. వెరసి నిరుద్యోగ భృతి పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పథకం కొనసాగిస్తారా? నిలిపివేస్తారా? అనేదానిపై యువత అయోమయంలో ఉన్నారు. వారంతా కొత్త ప్రభుత్వంపై ఆశ పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కొనసాగిస్తుందా? లేదా? అనేది తెలియడం లేదు. నిరుదోగ్య భృతిపై ఇంకా ఎటువంటి సృష్టత లేకపోవడంతో ఆయా లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read