నాలుగు రోజులు క్రితం, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, జగన్ మోహన్ రెడ్డికి భారీగా ఎలివేషన్ లు ఇస్తూ, పోస్ట్ లు పెట్టారు. అదేమిటి అంటే, వారం రోజులు క్రితం, కోవాక్సిన్ కు సంబంధించి, జగన్ మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీకి లేఖ రాసరాని, కోవాక్సిన్ ఫార్ములాని ఇతరులకు ఇస్తే, వాళ్ళు కూడా కోవాక్సిన్ తయారు చేస్తారని లేఖ రాసారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని అంతకు ముందే కేంద్రం, భారత్ బయోటెక్ తో మాట్లాడి, మూడు ప్రభుత్వ రంగ కంపెనీలతో, కోవాక్సిన్ ఉత్పతికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన తరువాత, ఇప్పటికే కోవాక్సిన్ ఉత్పత్తికి, మూడు కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఇంకేముంది, ఇది పట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ వల్లే, కేంద్రం దిగి వచ్చి, భారత్ బయోటెక్ ని ఆదేశించటం వల్లే, ఒప్పుకున్నారు అంటూ, మా జగన్ విజనరీ అంటూ, సోషల్ మీడియాలో హడావిడి చేసారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షిలో కూడా, జగన్ లేఖ వల్లే కదలిక అంటూ, వార్తలు వండి, ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి ఒక విజనరీ అనే విధంగా, తీసుకుని వెళ్లారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ప్రచారం నీతి ఆయోగ్ వరకు చేరటంతో, నీతి ఆయోగ్ ఘాటుగా స్పందించింది.
ఎవరో చెప్పటం వల్ల, కేంద్రం కోవాక్సిన్ తయారికి మూడు ప్రభుత్వ రంగ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది అంటూ, జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అంటూ, నీతి ఆయోగ్ ప్రెస్ మీట్ లో తీల్చి చెప్పింది. ఒప్పందాలు ఎవరో చెప్తే జరగవు అని, దానికి సాంకేతిక అంశాలు అనేకం ఉంటాయని, ఒక వ్యాక్సిన్ బయటకు రావాలి అంటే ఎన్నో ప్రాసెస్ లు ఉంటాయని చెప్పింది. కోవ్యాక్సిన్ ని వేరే కంపెనీలతో ఉత్పత్తి చేసే విషయం పై, కొన్ని నెలలుగా సమాలోచనలు జరుగుతున్నాయని, ఇప్పటికే మూడు కంపెనీలకు నిధులు కూడా ఇచ్చామని చెప్పింది. కోవ్యాక్సిన్ తయారికి బీఎస్‌ఎల్3 ల్యాబ్ లు కావాలని, ఈ ల్యాబ్ లు మన దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎవరో చెప్తే నిర్ణయం తీసుకుని, రేపు ఉత్పత్తి మొదలు పెట్టే వ్యవహారం ఇది కాదని తేల్చి చెప్పింది. కోవ్యాక్సిన్ ఉత్పత్తి భారీగా పెరుగుతుందని, దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ లు తయారు చేసే కంపెనీలు, శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా చేయవద్దు అంటూ పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి సూచనలు చేసింది.