శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్‌లో ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. రేపటి నీతి ఆయోగ్ భేటీలో, ఏ అంశాలు ప్రస్తావించాలి అనే అంశాల పై చర్చించారు. ఢి ల్లిలో జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో మరో సారి రాష్ట్రానికి చెందిన సమస్యలపై గళం విప్పాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలోని భేటీలకన్నా ఈసారి సమావేశానికి సంబంధించిన భేటీ క్లుప్తంగా వుందని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్ భవ కార్యక్రమంపై ప్ర జలలో ఏమంతగా స్పందన లేదన్నారు. గత సమావేశంలో చర్చించిన స్వచ్చభారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర అంశాలు ఈ భేటీలో లేవన్నారు. 17న జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చపోవ డాన్ని నిలదీస్తామన్నారు.
నగదు కొరత వల్ల రైతులు, వ్యాపా రులు, వేతన జీవులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి , వెనుకబడిన జిల్లాల నిధులు, రైతుల ఆదాయంరెట్టింపు చేస్తామన్న హామీ అమలు కాకపోవడం, ఎం.ఎస్.పి నిర్ణయం లో వివక్ష, పోషకాహారం, పంటబీమా, పథకంలోపాలు, యు వతకు ఉపాధి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలలో అభద్రత గురించి ప్రస్తావించనున్నట్టు తెలిపారు. 15వ ఆర్థిక కమిషన్ నిబంధనలతో రాష్ట్రాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం వుందని, ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాలు ఆదాయాన్ని సైతం కోల్పోయే ప్రమాదం ఏర్పడందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పథకాలకు సబంధించిన నిధుల విడుదల, జాప్యం విషయంలోనూ ఏ.పి తరపున ప్రశ్నించడానికి వెనకాడేది లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పారదర్శకమనీ, పైగా ఇక్కడి నూతనత్వం, ఆవిష్కరణలు, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై కూడా స్వయంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రుల్లో మాట్లాడే తొలి అవకాశం ఆంధ్ర సీఎంకే వస్తుందని అంచనా. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన అభిప్రాయాలను చంద్రబాబు బలంగా వినిపించనున్నారు. ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడం, వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పిదాలను ఎత్తిచూపాలని ఆయన నిర్ణయించుకున్నారు. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో భావసారూప్యం ఉన్న వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ సమావేశంలో వేడి పుట్టించాలన్న వ్యూహంలో ఆయన ఉన్నారు. దీనిపై ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్ వంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగిలిన సీఎంలతోనూ టచ్‌లో ఉన్నానని ఎంపీలకు చెప్పారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే ఆయా రాష్ట్రాల బృందాలు నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మంత్రి కార్యాలయం ఒక కౌంటర్ వ్యూహం సిద్ధం చేసుకునట్టు తెలుస్తుంది. అక్షర క్రమం ప్రకారం, ముందుగా ఆంధ్రప్రదేశ్ తరుపున చంద్రబాబు మాట్లాడతారు కాబట్టి, ఆయన మాట్లాడిన తరువాత ప్రధాని సమావేశానికి రావటం ఒకటి అయితే, రెండోది, నీతి ఆయోగ్ సమావేశ ఎజెండా ప్రకరామే మాట్లాడాలని, వేరే అంశాలపై మాట్లాడవద్దు అని ముఖ్యమంత్రిని నిలువరించటం వంటి, ప్రయత్నాలు జరుగుతాయని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఏమి చేసినా సరే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు, ప్రధాని మోడీని నిలదీసి, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష వినిపించి వస్తానని, ముఖ్యమంత్రి చెప్పారు.