ఆర్టీజీఎస్‌ చూస్తుంటే భారత్‌లో ఉన్నట్లుగా అనిపించడం లేదని, ఇదో అద్భుతం, అమోఘం అని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌) కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరు గురించి, దాని ద్వారా ప్రజలకు సకాలంలో ప్రభుత్వం ఏవిధంగా సేవలు అందిస్తున్నది ఆర్టీజీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వహణాధికారి-సీఈఓ) అహ్మద్‌ బాబు వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు భూసార పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచడం, వాటి ద్వారా రైతులు వారి భూమి సారాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు ఇస్తున్న వైనాన్ని వివరంచారు.

rtgs 26112017 2

రాష్ట్ర వ్యాప్తంగా సర్వైలెన్స్‌ కెమెరాలను ఉపయోగించి నిఘా పర్యవేక్షణ, విపత్తలు, ప్రమాదాల సమయంలో ఎలా ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్నది వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 వేల కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, పౌరులు ఇంటికి తాళం వేసి బయట ఊళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంటికి పోలీసులు కెమెరాల గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కాపాడుతున్న తీరును వివరించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరును ప్రత్యక్షంగా తిలకించిన నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఆయన బృందం ఆర్టీజీఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను భారత్‌లో ఉన్నట్లుగా లేదని, ఇదో అద్భుతమని అన్నారు.

rtgs 26112017 3

దేశంలో మరెక్కడా కూడా ఇలాంటి వ్యవస్థ లేదని, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇదో మంచి ఆలోచన, ఆర్టీజీఎస్‌ నిజంగా కళ్లు తెరిపిస్తోంది. ఏపీ సాధించిన ఒక గొప్ప అద్భుతమైన విజయం ఆర్టీజీఎస్‌ అన్నారు. ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ తరహాలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేసుకుని డిజిటల్‌ బాట పట్టాలని సూచించారు. ప్రతి రాష్ట్రానికి తాము ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీజీఎస్‌ను చూడాలని సిఫారసు చేస్తామని చెప్పారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్‌ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి)ల సదస్సు జరుగుతోందని, అందులో ఆర్టీజీఎస్‌ గురించి ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ ఆహ్వానించిందని, దీనివల్ల మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి తెలుసుకోగలుగుతాయని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read