కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి షాక్ లు ఇవ్వటం చాలా మామూలు విషయం అయిపొయింది. మొన్నటి వరకు చంద్రబాబు ఉన్నా, ఇప్పుడు జగన్ ఉన్నా, ఇదే పరిస్థితి. కాకపొతే అప్పుడు చంద్రబాబు, తాను మోడీ, అమిత్ షాను డీ కుంటే, రాజకీయంగా నష్టపోతాను అని తెలిసినా, ఎదురు తిరిగారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అప్పట్లో మెడలు వంచుతా అన్న వ్యక్తి, ఇప్పుడు మాత్రం, అధికారం రాగానే, మనం మోడీతో పెట్టుకోలేం, అమిత్ షా పవర్ ఫుల్ మ్యాన్ అంటూ చేతులు ఎత్తేసారు. అంతే కాదు, చంద్రబాబు పోరాటాలు చేస్తే, ఈయన మాత్రం, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ మోడీని బ్రతిమలాడి, ఆయన మనసు కరిగే దాకా, ప్లీజ్ ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంటానని, ఎదో ఒక రోజు ఇస్తారేమో చూద్దాం అంటూ జగన్ మోహన్ రెడ్డి తన వైఖరి ప్రకటించారు.
పోరాడితేనే ఏమి ఇవ్వని మోడీ, షా, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే ఇస్తారా ? ఈ రోజు కూడా అదే జరిగింది. వైసిపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, కేంద్రాన్ని ఒక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేకంగా పన్ను రాయతీలు ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా ? మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అంటూ ప్రశ్న వేసారు. ప్రధాని ప్రత్యెక హోదా ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదని, కనీసం మా రాష్ట్రానికి పన్ను రాయతీలు అయినా ఇవ్వండి, మా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, కనికరించింది అంటూ ప్రశ్న వేసారు. అయితే కేంద్రం మాత్రం, ఇది కుదరదు అని తేల్చి చెప్పింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మాకు మీ రాష్ట్రానికి పన్ను రాయతీలు ఇచ్చే ఉద్దేశం ఏమి లేదు అంటూ, సమాధానం ఇచ్చారు.
మా ప్రభుత్వం ఏమైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, అన్ని రాష్ట్రాలకు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకుంటాం కాని, మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేం అంటూ తేల్చి చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యెక పరిస్థితుల్లో ఏర్పడిన రాష్ట్రం అని కేంద్రం మంత్రి మర్చిపోయారు. ఆనాడు ఇచ్చిన హామీలు ఏమి మంత్రిగారికి గుర్తు లేదు. అయితే వైసిపీ సభ్యడు అడిగిన ప్రశ్నతో మనకు ఏమి ఇవ్వరు అని తెలిసిపోయింది. అయితే ఇదే సందర్భంలో, ఆనాడు చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ పై మాత్రం, కేంద్రం మంత్రి ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. విశాఖ మెడ్ టెక్ జోన్ విషయంలో, మీరు ఏమైనా ప్రతిపాదనలతో వస్తే, దాని పై ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.