ఇది నిజంగానే షాకింగ్ న్యూస్... నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, ఏపీ చీఫ్ సెక్రటరీకి, రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ లేదని తేల్చి చెప్పారు... దీంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఇదే సందర్భంలో రాజకీయంగా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అలోచించి, ముందుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను చంద్రబాబు ఆదేశించారు.. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ తీసుకున్నారు...
ఈ రోజు సాయంత్రం, నాలుగు గంటలకు తెలుగుదేశం ఎంపీలకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ ఇచ్చారు.... ఈ సందర్బంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిందే అని, దానికి సంబాధించి అన్ని విషయాలతో పాటు, కొన్ని ఏళ్ళుగా ప్రజల సెంటిమెంట్ గురించి కూడా ప్రస్తావించటానికి రెడీ అయ్యారు... అయితే అనూహ్యంగా, అప్పాయింట్మెంట్ టైం ఇప్పుడు కాదని కబురు వచ్చింది, మరి కొంత సేపటికే, అప్పాయింట్మెంట్ కాన్సిల్ అయినట్టు తెలుగుదేశం ఎంపీలకు కబురు వచ్చింది...
దీంతో అసలు ఏమైందా అని వాకబు చేసారు, మళ్ళీ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు... ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, వైసిపీ ఎంపీతో సమావేశం అయ్యారనే వార్త తెలుగుదేశం ఎంపీలకు తెలిసింది... వైసిపీ ఎంపీ శివప్రసాద్, పియూష్ గోయల్ ని కలిసి, కొన్ని ప్రాజెక్ట్ ల పై వినతి పత్రం ఇచ్చారని తెలిసింది... దీంతో, తమకు అప్పాయింట్మెంట్ కావలనే రద్దు చేసి, మనల్ని రెచ్చగొట్టటానికే, వైసిపీ ఎంపీతో సమావేశం అయ్యారని తెలుగుదేశం ఎంపీలు భావిస్తున్నారు... దీంతో, వెంటనే శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు, రైల్వే జోన్ ఆవశ్యకత పై, పియూష్ గోయల్ కు లెటర్ రాసారు... మొత్తానికి, ఈ ఎపిసోడ్ తో మళ్ళీ, బీజేపీ - వైసిపీ బంధం మరో సారి బయట పడింది... స్వతహాగా పియూష్ గోయల్ ఇలా చెయ్యరని, పై నుంచి ఒత్తిడి వల్లే, ఇలా చేసారని, తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి...