కేంద్ర ఎన్నికల సంఘం గత బుధవారం నాడు, ఏఏ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నాయో, ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి, డీజీపీలు, అదే విధంగా చీఫ్ సెక్రటరీలు, హోం శాఖా, ఇతర ఉన్నతాధికారులతో, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు, వీరి అందరితో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఉప ఎన్నికల పై అభిప్రాయం అడిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటు వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, పరిస్థితి ఎన్నికలకు అనువుగా ఉన్నాయా లేదా, ఎన్నికలు జరపవచ్చా లేదా అనే అంశం పై, రాష్ట్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తెలుసుకుంది. అయితే అనేక రాష్ట్రాలు ఉప ఎన్నికలకు సై అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పగా, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మాత్రం ఇప్పుడే ఉప ఎన్నికలు వద్దు అని చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా బద్వేల్ లో ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, తెలంగాణాలో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరగా, తమకు పండుగలు ఉన్నాయని, వినాయక చవితి, దసరా పండుగలు ఉన్నాయని, దీపావళి పండుగ ఉందని, పండుగుల సీజన్ ఉండటంతో, అలాగే ప్రస్తుతం వర్షాలు బాగా పడుతూ ఉండటం, అక్కడక్కాడా వరదలు ఉండటంతో, ఎన్నికలు వద్దు అని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారు.
నిజానికి వినాయక చవతి, దసరా, దీపావళి అనే పండుగలు అన్ని రాష్ట్రలలో చేసుకుంటారు. వినాయక చవతి, దీపావళి మన కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువ చేసుకుంటారు. దసరా కూడా పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా చేసుకుంటారు. మరి వాళ్లకు లేని ఇబ్బంది, మనకు ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదు. ఎన్నికలు అంటే, మనం భయపడుతున్నామా ఏమిటి అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా ఉంది, రోడ్డులు కానీ, అప్పులు కానీ, పెన్షన్లు ఎత్తివేయటం కానీ, కరెంటు చార్జీలు కానీ, ఇలా అనేక అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఒక సాకుగా చెప్పి, తప్పించుకున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా, తెలంగాణా, ఏపిలో ఎన్నికలు లేకుండా ఉప ఎన్నికల షడ్యుల్ విడుదల చేసింది. బెంగాల్‍లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. బెంగాల్‍లో భవానీపూర్, శంషేర్‍గంజ్, జంగీపూర్, ఒడిశాలోని పిప్లీ నియోజవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది.