ఒక పక్క జగన్ నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ఊరు ఊరు తిరుగుతుంటే, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చెయ్యటానికి అభ్యర్ధులే కరువు అవుతున్నారు... జగన్ పరిస్థితి ఎంత దారుణం అంటే, కృష్ణా జిల్లా లాంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లలో, కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో, వైసిపి తరుపున నిలబడటానికి నాయకులు లేక జగన్ పార్టీ ఇబ్బంది పడుతుంది... 2019 ఇంకో ఏడాదిన్నర కాలంలో ఉండగా పార్టీనే అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతోంది.... గన్నవరంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఇప్పటిదాకా దుట్టా రామచంద్రరావు... 2014 లో, వల్లభనేని వంశీ పై పోటీ చేసి ఓడిపోయారు.
ఓడిపోయినా సరే, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు... ఏమైందో ఏమో కాని, హఠాత్తుగా ఈ మధ్య పార్టీకి దూరామై, తాజాగా గన్నవరంలో కూడా తనకి పోటీ చేసే ఉద్దేశం లేదని, ఇంకో అభ్యర్థి ని చూసుకోవాలని జగన్ కి చెప్పారు... పైకి మాత్రం, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, 2019 లో గెలుపు మీద నమ్మకం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు... ఒక పక్క వంశీ బలమైన అబ్యార్ధిగా ఎదగటం, మరో పక్క ప్రభుత్వం గన్నవరం నియోజకవరాగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యటంతో, తెలుగుదేశం తరుపున నుంచునే అభ్యర్ధి మాత్రమే గెలుపొందే అవకాశాలు ఉండటంతో, దుట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు...
దీంతో జగన్, కొత్త అబ్యార్ది కోసం వెతుకుతూ, గన్నవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కొత్త పదవి యార్లగడ్డ వెంకట్రావును నియమించారు... యార్లగడ్డ వెంకట్రావు, ఇప్పటి వరకు పెనమలూరు సీటు కోసం ప్రయత్నించి, అక్కడ ఒక ట్రస్ట్ పెట్టి, పని చేస్తూ వస్తున్నారు... ఇప్పుడు ఆర్థిక, సామాజిక బలం బేరీజు వేసుకుని, జగన్, వంశీ పై యార్లగడ్డ వెంకట్రావును దింపారు... కాని, స్థానికేతరుడైన యార్లగడ్డ వెంకట్రావును ప్రజలు ఆదరిస్తారా అనేది చూడాలి... నిజానికి పోయిన సారి అభ్యర్ధిగా నుంచున్న దుట్టా రామచంద్రరావుకు, క్లీన్ ఇమేజ్ ఉంది.. నియోజకవర్గంలో మంచి వ్యక్తిగా, మంచి డాక్టర్ గా పేరు ఉంది... జగన్ ఇమేజ్ కంటే, ఈయన సొంత ఇమేజ్ తోనే పోయిన సారి ఓట్లు వచ్చాయి... ఈ సారి, యార్లగడ్డ వెంకట్రావు అబ్యార్ధిగా నుంచుంటే, ఆ ఇమేజ్ కూడా ఉండదు...ఈయన కొత్త వారు, జగన్ ఇమేజ్ సంగతి సరే సరి... ఇది కృష్ణా జిల్లా లాంటి కీలకమైన చోట, జగన్ పార్టీ పరిస్థితి... ఇక అనుకోకుండా డెలిమిటేషన్ కూడా జరిగితే 225 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కూడా వైసీపీ కి కత్తి మీద సామే అవుతుంది.