ప్రతిపక్షంలో ఉండగా, ప్రభుత్వం పై ఆరోపణలు చెయ్యటం చాలా స్వర్వ సాధారణం. కాని, ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ మాత్రం, చంద్రబాబు ఆరు లక్షల కోట్లు అవినీతి చేసారని, ప్రతి స్కీంలో అవినీతి అంటూ ప్రచారం చేసారు. ఇదే కోవలో, తెలుగుదేశం ప్రభుత్వం బీసీల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదరణ పధకం పై కూడా ఆరోపణలు చేసారు. ఈ స్కీంలో చాలా అవినీతి చేసారని, బీసీలు పేరు చెప్పుకుని, చంద్రబాబు అవినీతి చేసారని ఆరోపణలు చేసారు. అయితే తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో, బీసీల విషయంలో అడిగిన ప్రశ్నకు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. బీసీల కోసం గత 5 ఏళ్ళలో ఎంత ఖర్చు పెట్టరు అని అడిగితే, మొత్తం 36 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ, 28.8 వేల కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. అదే సందర్భంలో, బీసీల కోసం చేపట్టిన ఆదరణ పధకంలో, వివిధ రకాల టూల్స్ కొనుగోలులో, అవినీతి జరిగిందా అనే ప్రశ్నకు, వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పింది.

aadarana 17122019 2

ఆదరణ పధకంలో అవినీతి జరిగినట్టు ఎలాంటి కంప్లైంట్ లు రాలేదని, అందుకే ఎలాంటి ఎంక్వయిరీ జగరలేదు అంటూ, ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే గతంలో విపక్షంలో ఉండగా వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ తప్పే అని తేలిపోయింది. ఇప్పటికే పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే, ఇసుక అక్రమాల పై కూడా, ఎలాంటి అవినీతి జరగలేదు అంటూ, గ్రీన్ ట్రిబ్యునల్ కు ప్రభుత్వం చెప్పింది. ఇలా గతంలో తాము చేసిన ఆరోపణలు అన్నిటికీ, ఇప్పుడు తామే క్లీన్ చిట్ ఇస్తూ, చంద్రబాబు హయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, వైసీపీ ప్రభుత్వమే చెప్తూ వస్తుంది. అయితే ఈ విషయం పై, నిన్న టిడిపిలో కూడా చర్చ జరిగింది.

aadarana 17122019 3

అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తరువాత, మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్ పి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాల పై చర్చించారు. "ఆదరణ పథకంలో అవినీతి జరగలేదని శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా వైసిపి ప్రభుత్వమే పేర్కొంది. పోలవరంలో కూడా ఏవిధమైన అక్రమాలు జరగలేదని సాక్షాత్తూ కేంద్రమంత్రే పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మిట్స్ ద్వారా రూ.1,39,000కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,54,000మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసన మండలిలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిని బట్టే టిడిపి హయాంలో సమ్మిట్స్ విజయవంతం అయ్యాయని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. దేశంలో 6సమ్మిట్స్ నిర్వహించి, సత్ఫలితాలను రాబట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. " అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read