గతంలో, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ, అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ప్రధాని మోడీ కూడా, ఎన్నికల ప్రచారంలో , ఏపి వచ్చి, చంద్రబాబుకు పోలవరం ఏటీఏంల మారింది అంటూ, ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసారు. అయితే ఇవన్నీ కేవలం రాజకీయం కోసం చేసిన వ్యాఖ్యలు అని, చంద్రబాబుని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టటానికి మాత్రమే చేసిన వ్యాఖ్యలు అని, ఇప్పుడు తేలిపోయింది. అటు కేంద్రం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాని, చంద్రబాబు హయంలో, పోలవరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అంటూ, వచ్చిన ఫిర్యాదుల పై, ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. పెంటపాటి పుల్లారావు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ, పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ పై, ఎలాంటి విచారణ అవసరం లేడని తేల్చి చెప్పింది. ప్రధాని కూడా పోలవరంని ఏటీఏంలా వాడుకుంటున్నారు కదా అని ఆడగగా, కేంద్ర జలశక్తి శాఖ వాటిని కూడా తోసిపుచ్చింది.
తమకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి, పోలవరం ప్రాజెక్ట్ పై విచారణ జరపమని, ఎక్కడా ఆదేశాలు రాలేదని తేల్చి చెప్పింది. అంతే కాదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వమే, పోలవరం ప్రాజెక్ట్ పై అవినీతి జరిగింది అంటూ వేసిన విచారణ కమిటీ నివేదికనే పక్కన పెట్టిందని కేంద్రం చెప్పింది. నిబంధనలు ప్రకారమే, మొత్తం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది అని, పోలవరం పై ఎలాంటి అవినీతి గత ప్రభుత్వ హయంలో జరగలేదని చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం చెప్పింది. జరిగిన నిర్ణయాలు అన్నీ, అథారిటీ ఆదేశాల ప్రకారమే జరిగాయని చెప్పింది. 2017లో కాంట్రాక్టు మార్పు కూడా, నిబంధనలు ప్రకారమే జరిగిందని చెప్పింది. అంచనాల పెరుగుదలకు అనేక కారణాలు ఉంటాయాని చెప్పింది. కొన్ని చెల్లింపుల పై రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ జరుగుతుందని, ప్రధానికి జలశక్తి శాఖ నివేదించింది. దీనికి సంబందించిన పూర్తి నివేదికను జలశక్తి శాఖ, కేంద్రానికి పంపింది.