ఇన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు, విచ్చల విడిగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అన్ని వైపుల నుంచి సహకారం వచ్చి, అప్పులు ఇష్టం వచ్చినట్టు చేసారు. అటు కేంద్రం కానీ, ఇటు బ్యాంకులు కానీ, ముందు వెనుకా చూసుకోకుండా అప్పులు ఇచ్చారు. రూల్స్ ని అతిక్రమించి మరీ అప్పులు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకులు కూడా చిత్ర విచిత్ర షరతులు పెట్టి అప్పులు ఇచ్చాయి. చివరకు 25 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగే మద్యం పైన కూడా అప్పులు తెచ్చారు అంటే, ఎంతటి గొప్ప వాళ్ళో అర్ధం అవుతుంది. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటి వెళ్తే, ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే పరిస్థితి వచ్చింది. అటు కేంద్రం కానీ, ఇటు బ్యాంకులు కానీ, అప్పులు ఇవ్వాలన్నా, ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే కేంద్రం అప్పు ఇచ్చేది లేదని, తమకు ముందు పాత లెక్కలు చెప్పాల్సిందే అని, కూర్చోవటంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 20 రోజులుగా అప్పులు పుట్టక విలవిలలాడుతుంది. తాజాగా బ్యాంకులు వద్ద నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురైంది. ఇష్టం వచ్చినట్టు గాల్లో లెక్కలు చెప్పటం కాదని, తమకు కచ్చితంగా చెప్తేనే అప్పు ఇస్తాం అంటూ బ్యాంకులు తెగేసి చెప్పాయి.

appu 03052022 2

హైకోర్టు ఆదేశాలు ప్రకారం, అమరావతిలో నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. దీంతో ప్రభుత్వం డబ్బులు లేక, బ్యాంకులు వద్ద, తమకు రూ.3 వేల కోట్ల పైన అప్పు కావాలని ప్రతిపాదనలు పెట్టాయి. నిన్న సీఆర్డీఏ అధికారులు పెట్టిన ఈ మీటింగ్ కు, అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వచ్చాయి. అయితే వారు మాత్రం ఇంతకు ముందు లాగా, చూసి చూడనట్టు అప్పు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అసలు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందా, లేక మూడు రాజధానులు ఉంటాయా అనేది ముందు స్పష్టం చేయాలని, తరువాతే ఈ అప్పు విషయం పై ముందుకు వెళ్తాం అని తేల్చి చెప్పారు. దీంతో ఖంగు తిన్న అధికారులు, మూడు రాజధానులు బిల్లు వెనక్కు తీసుకున్నారు కాబట్టి, ఒకే రాజధాని ఉంటుందని స్పష్టం చేసారు. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత, ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానులు అంటుంది కదా అని అడగ్గా, ఇటు వైపు నుంచి సరైన సమాధానం లేదు. దీంతో అమరావతి ఏకైక రాజధాని పై తమకు స్పష్టత వస్తేనే, ఈ రుణం పై,ప్రతిపాదనలు ముందుకు వెళ్తాయని బ్యాంకులు తేల్చి చెప్పాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read