కేబినెట్ సమావేశం గురించి మంత్రులు చెప్పింది చూస్తే, ప్రజలకు ఉపయోగపడే అంశాలేవీ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టుగా లేదని, నిరుద్యోగ యువత జాబ్ కేలండర్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన, ధర్నాలను ప్రభుత్వం పట్టించుకొనిఉంటే, దానిపై ప్రకటన చేసేవారని, దాన్ని బట్టే నిరుద్యోగుల సమస్యల ఊసే కేబినెట్ లోచర్చించలేదని అర్థ మవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూపాయి పనికి 100 రూపాయల ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, గ్రూప్-1, గ్రూప్-2 లో 36 పోస్టుల ప్రకటింపును సమర్థించుకోవడం సిగ్గు చేటన్నారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, ఇతరప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 నుంచి 20వేల ఖాళీలుంటాయని, టీచర్ పోస్టులు దాదాపు 16 నుంచి 18వే ల వరకు ఉంటాయని, వాటన్నింటి భర్తీ గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నాయనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆయన అధికారంలోకి వచ్చాక ఏర్పడిన ఖాళీలను కూడా కలిపి జాబ్ కేలండర్ ఎందుకు విడుదల చేయలేదో ఆయనే నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని పరుచూరి డిమాండ్ చేశారు. పోలీస్ , వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఖాళీలను పట్టించుకో కుండా, నిరుద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమంత్రి తన ఆలోచనలతో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు. యువత ఎందుకిలా ఆందోళనలు చేస్తుందనే ఆలోచన పాలకులకు ఉంటే, కచ్చితంగా జాబ్ కేలండర్ పై కేబినెట్ లో చర్చించి ఉండేవాళ్లన్నారు.

cabinet 30062021 2

తాను తీసుకున్నదే నిర్ణయం... తను చెప్పిందే వేదమన్నట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యో గాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు వెలువడే, 4, 5నెలల ముందే యువత ఉద్యోగాల సాధనకు సన్నద్ధమయ్యేదని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనే ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయిందన్నారు. జగన్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఏడాదికి 45వేల పోస్టుల వరకు భర్తీ చేయాల్సి ఉందని, అవేవీ చేయకుండా ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ కేలండర్ ను టీడీపీ సహా, యువతంతా తీవ్రంగా తప్పుపడుతోందన్నారు. కేబినెట్ సమావేశం ఛాయ్, బిస్కట్ సమావేశంలా సాగిందని మంత్రుల మాటల్లో నే అర్థమైందన్నారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ కేలండర్ ను రద్దుచేసి, ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో గుర్తించి, ప్రణా ళికాబద్ధంగా సరికొత్త జాబ్ కేలండర్ విడుదల చేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు అశోక్ బాబు తేల్చి చెప్పారు. నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలను పరిగణనలో కి తీసుకోకుండా, ప్రభుత్వం తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుందన్నారు. నేడు జరిగిన కేబినెట్ సమావేశానికి ఎలాంటి నిబద్ధత, ప్రజాసంక్షేమం గురించిన ఆలోచనలు లేవని స్పష్టమైందన్నారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగాల ఖాళీలపైతక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read