సహజంగా పార్లమెంట్ లో రాష్ట్రానికి సంబందించిన ప్రశ్నలు ఎంపీలు అడుగుతూ ఉంటారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్ట్ ల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ , తమ గొప్ప చెప్పుకునే విధంగా, ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తుంది. ఇది సహజంగా అన్ని రాష్ట్రాల ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నలు అడిగే తీరు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం, తమ ప్రభుత్వానికి మంచి కంటే, చెడు చేసే ప్రశ్నలు వేస్తూ, టిడిపి పాత్ర కూడా వారే పోషిస్తున్నారు. ఇది తెలియక చేస్తున్నారో, సమాచారం లేక చేస్తున్నారో, లేదా అత్యుత్సాహంతో చేస్తున్నారో కానీ, ఎంపీలు అడిగే ప్రశ్నలు, కేంద్రం చెప్పే సమాధానాలతో, జగన్ సర్కార్ డొల్లతనం బయట పడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, 2019లో హైదరాబాద్ లో దిశ సంఘటన జరిగిన తరువాత, ఏపి ప్రభుత్వం మహిళల కోసం అని దిశ చట్టం తీసుకుని వచ్చింది. ఇప్పటికే అనేక చట్టాలు ఉండగా, అవి సరిగ్గా ఉపయోగిస్తే చాలు, ఈ చట్టం, చట్ట ప్రకారం నిలబడదు, ఇది కేవలం ప్రచారం కోసం చేస్తున్న హడావిడి అని అనేక మంది అప్పట్లోనే విమర్శలు చేసినా, వైసీపీ సర్కార్ వినిపించుకోలేదు.

disha 27072021 2

వైసీపీ ప్రతి విషయంలో చేసిన అతి ఎలా బెడిసికొడుతుందో, ఇది కూడా అలాగే రివర్స్ అయ్యింది. ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండా, కొన్ని అభ్యంతరాలు తిప్పి పంపింది. అంటే ఈ చట్టం అమలులో లేనట్టే కదా. అయినా దిశ చట్టం ప్రకారం శిక్షలు విధించాం అంటారు, దిశ పోలీస్ స్టేషన్ లు అంటారు, దిశ వాహనాలు అంటారు, దిశ యాప్ అంటారు, లేని చట్టం మీద, గత రెండేళ్లుగా హడావిడి చేస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన సమాధానంతో బట్టబయలు అయ్యింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దిశ చట్టం ఆమోదం గురించి కేంద్రాన్ని ప్రశ్నించగా, కేంద్రం హోంశాఖ సమాధానం ఇస్తూ, దిశ బిల్లు పై పలు అభ్యంతరాలు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపామని, అయితే ఇప్పటి వరకు తాము లేవనెత్తిన అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వివరణ ఇవ్వలేదని, ఎలాంటి స్పందన రాలేదని, తమ సమాధానంలో తెలిపింది. మరి ఇంత ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు అభ్యంతరాలకు సమాధానం చెప్పలేదు, ఎందుకు బిల్లు ఆమోదం చేపించలేదు అనేది, మిలియన్ దాలర్ల ప్రశ్న.

Advertisements

Advertisements

Latest Articles

Most Read