ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో సారి మొండి చేయి చూపించింది. ఏపి విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ, ఒక్కొక్కటీ, కేంద్ర ప్రభుత్వం క్రమక్రమంగా తుంగలోకి తొక్కుతూ వచ్చింది. తాజాగా రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం షాక్ ఇచ్చింది. రైల్వే జోన్ కి కూడా కేంద్రం ఇక మంగళం పడినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే, గత ఎన్డీఏ వన్ హయాంలో ఎన్నికల ఏడాది వచ్చినప్పుడు, అప్పటి రైల్వే మంత్రి పియూష్ గోయల్, వైజాగ్ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం అంటూ, ఆయన ప్రకటన చేసారు. ఆ ప్రకటన మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి, సాధ్యాసాద్యాలను ఒక నివేదిక రూపంలో కూడా ఇవ్వమన్నారు. ఆ నివేదిక ప్రకారం, రైల్వే జోన్ ఏర్పాటు ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఆ తరువాత ఎన్నికలు రావటం, తరువాత చంద్రబాబు కాకుండా, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, ఈ అంశం మరుగున పడిపోయింది. అప్పట్లో చంద్రబాబు గట్టిగా పోరాడి సాధిస్తే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప,మనం చేసేది ఏమి లేదని చెప్పారు. దీంతో కేంద్రం కూడా లైట్ తీసుకుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం కూడా పూర్తిగా రైల్వే జోన్ గురించి మర్చిపోయాయి. దీంతో ఈ అంశం పూర్తిగా మరుగున పడిపోయింది.

railway 08122021 2

రాష్ట్ర ప్రభుత్వమే, ఈ అంశం గురించి పట్టించుకోక పోవటం, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఎందుకులే అనుకున్నట్టు ఉంది. ఈ రోజు లోక సభలో, బీజేపీ ఎంపీ అజయ్‍నిషాద్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇచ్చిన సమాచారం చూస్తే, దేశంలో ఎక్కడా కూడా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 17 రైల్వే జోన్ లు ఉన్నాయని, ఆ 17 రైల్వే జోన్లు ప్రస్తవాన చెప్తూ, గతంలో కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ని మాత్రం, ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎక్కడా విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన చేయలేదు. అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్న కొత్త రైల్వే జోన్ ల విషయంలో, కొత్తవి ఏర్పాటు చేసే ఉద్దేశం ఏమి కేంద్రానికి లేదని, కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. దీంతో ఇక వైజాగ్ రైల్వే జోన్ ని కేంద్రం పూర్తిగా మర్చిపోయిందనే చెప్పవచ్చు. కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తా అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏ మాత్రం, విభజన హామీల మీద స్పందించక పోవటం శోచనీయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read