చంద్రబాబు సృష్టించిన ఒక అద్భుతం పట్టిసీమ.. అయినా రైతులు ఓడించారు అనుకోండి అది వేరే విషయం... రాష్ట్రం ఏర్పాటు కాగానే, కృష్ణా నుంచి నీరు రాదని గ్రహించి, వెంటనే పట్టిసీమ నిర్మాణం పూర్తి చేసి, ప్రత్యక్షంగా కృష్ణా డెల్టాకు, పరోక్షంగా రాయలసీమకు నీరు ఇచ్చేలా రికార్డు సమయంలో, పట్టిసీమ పూర్తి చేసారు. నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు, పోలవరానికి కేంద్రం సహకరించదు అని గ్రహించి, చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దానికీ తగ్గట్టే 4 ఏళ్ళలో 240 టిఎంసీ దాకా నీళ్ళు ఎత్తి పోసి, రైతులను ఆదుకున్నారు. ఇక్కడ కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు ఇవ్వటంతో, రాయలసీమకు శ్రీశైలం నుంచి వచ్చే నీరు మళ్ళించారు. ఇలా చంద్రబాబు ఎంతో ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి రైతులకు అండగా నిలిచారు. అయితే అప్పట్లో జగన్ ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకించారు. అవగాహన లేకుండా పట్టిసీమ వేస్ట్ అంటూ వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావటంతో, పట్టిసీమ నీటిని వదిలితే, తమ వాదన తప్పు అవుతుందని, చంద్రబాబు సృష్టించిన ప్రాజెక్ట్ కరెక్ట్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది అని, పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు.

ప్రతి సారి జూన్ మొదటి వారంలో చంద్రబాబు నీళ్ళు వదిలే వారు. దీంతో రైతులు వానల కోసం చూడకుండా, పనులు చేసుకునే పరిస్థితి కల్పించారు. తుఫానుల కాలం నాటికి, పంట చేతికి వచ్చేది. దీంతో తుఫాను బారిన కూడా పంటలు పడకుండా ఉండేది. కాని, ఇప్పుడు జూన్ నాలుగవ వారం వస్తున్నా పట్టిసీమ నుంచి నీళ్ళు లేవు. మరో పక్క ఎప్పుడూ లేని విధంగా, జూన్ చివరకు వస్తున్నా వర్షాలు లేవు. దీంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిల్లో ఉండి పోయారు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పెద్దగా వర్షాలు లేకపోవటంతో ఈ ఏడాది కృష్ణానదికి వరద ప్రవాహం ఉండదు అనే చెప్పాలి. అప్పుడు ఇక తాగు నీటికి కూడా రాష్ట్రంలో దిక్కు ఉండదు. దీంతో ఇప్పుడు రైతులు అందరూ జగన్ వైపు చూస్తున్నారు. రాజకీయ కక్షలు పక్కన పెట్టి, పట్టిసీమ నుంచి నీటిని వదలాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని, పట్టిసీమను నమ్ముకుని 13 లక్షల ఎకరాల రైతులు పంట వెయ్యటానికి సిద్ధంగా ఉంటే, జగన్ ప్రభుత్వం చేసిన పనితో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. మరో పక్క అధికారులు మాత్రం, గోదావరిలో ప్రవాహం ఇంకా పెరగాలని, అప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తే, పట్టిసీమను వదులుతాం అని అంటున్నారు. మరి పట్టిసీమ వాడతారా, లేక పట్టిసీమ నీళ్ళు లేకుండా రైతులకు ఎక్కడ నుంచి అయినా నీళ్ళు తెచ్చి, జగన్ ప్రభుత్వం ఇస్తుందో వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read