ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేసి, ఏకంగా రివర్స్ పీఆర్సితో జీతాలు తగ్గించిన విషయం పై, ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. అలాగే మూడో తేదీ పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం చేపాట్టనున్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గుంటారని, ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం రావటంతో, ప్రభుత్వం అలెర్ట్ అయ్యి, ఈ రోజు ఎలాగైనా ఆ కార్యక్రమం వాయిదా వేయాలని చూసింది. అలాగే డీఏలు అన్నీ కలిపి కొత్త జీతం వేస్తూ, జీతం పెరిగినట్టు చెప్పారు. ఇన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నా, ఉద్యోగులు లొంగలేదు. దీంతో విజయవాడ పోలీసులు కమీషనర్ ఎంటర్ అయ్యారు. 3న చలో విజయవాడకు పర్మిషన్ లేదని చెప్పారు. కరోనా కారణంగా అనుమతి ఇవ్వలేం అని తేల్చి చెప్పారు. ఉద్యోగులు భారీగా వస్తారని అంచనా ఉందని, ఈ పరిస్థితిలో ఇది మంచిది కాదని అన్నారు.
ఉద్యోగస్తుల చలో విజయవాడ విషయంలో ట్విస్ట్.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్న ప్రభుత్వం...
Advertisements