అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్ బిల్డింగ్ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్ నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్, కస్టమ్స్ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..
ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. ఇంకా దారుణం ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు హజ్ యాత్రకు, గన్నవరం నుంచే వెళ్ళవచ్చు అని, ఇది వరకు అశోక్ మంత్రిగా ఉండగా ఆదేశాలు వచ్చాయి.. ఇప్పుడు మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, హజ్ యాత్రకు వెళ్ళే విషయం పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఈ ఏడాది కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్స్ ఇవ్వటం లేదని, సెంట్రల్ మైనారిటీ అఫైర్స్ తేల్చి చెప్పటంతో, ముస్లిం సోదరులు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మంది హాజీలు హజ్ యాత్రకు బయలుదేరబోతున్నప్పటికీ, మన రాష్ట్రంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కాకుండా, పొరుగురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హజ్‌యాత్రకు ప్రత్యేక విమానాలు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా.. విజయవాడ నుంచే తమ యాత్రను ప్రారంభించాలని హాజీలు భావిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఈ ఏడాది కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తీపి కబురు లేదు. సెంట్రల్ మైనారిటీ అఫైర్స్ కొత్తగా ఎలాంటి ఎంబార్కేషన్ పాయింట్స్ ఇవ్వటం లేదని చెప్పటంతో భవిష్యత్తు ఆశలపై కూడా నీళ్లు చల్లుతున్నట్టు అవుతోంది. మూడు వేల మంది హాజీలు బయలుదేరే ప్రాంతానికి ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వకపోవటం అర్థరహితమని భావించిన రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మొయిన్ అహ్మద్ హుస్సేన్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. ఆయన కేంద్ర మంత్రి నక్వీతో మాట్లాడినట్టు సమాచారం. నక్వీ సానుకూలంగా హామీ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో, ఇప్పటి వరకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలేదు..