మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులకు సంక్రాంతి పండగకు కూడా ఎదురు చూపులే మిగిలాయి. కనీసం 10 శాతం మందికి కూడా జీతాలు అందలేదని ఆందోళన చెందుతున్నారు. ఇటు చూస్తే పెన్షనర్ల లకు కూడా 50 శాతం మందికి కూడా పెన్షన్ అందలేదని వాపోతున్నారు. కొత్త సంవత్సరం రోజున ఇవ్వక పోయినా కాని, కనీసం పెద్ద పండగ అయిన సంక్రాంతి కి అయిన ఇస్తారని అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఇది వరకు RBI నుంచి వారానికి వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు అప్పు పుట్టేది , కాని గత రెండు వారల నుంచి మన ప్రభుత్వానికి అప్పే పుట్టడం లేదు. కొత్త అప్పులు చేయడానికి కేంద్రం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదట. అయితే ఈ అప్పుల కోసం ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన ,ఫైనాన్స్ సెక్రటరీ రావత్‌లు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా వీరికి మాత్రం అప్పు సాంక్షన్ అవ్వటం లేదు. దీనితో పెన్షనర్లకు, ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. RBI ఇచ్చే అప్పే మన రాష్ట్రానికి కీలకంగా ఉండటంతో ప్రభుత్వం డబ్బులు లేక సతమతమవుతుంది. అయితే ఈ నెల 10 ప్రారంభిచాల్సి ఉన్న EBC నేస్తం పధకం కూడా మొదలే పెట్టలేదు. దాని గురించి ప్రభుత్వం దగ్గర నుంచి ఊసే లేదు. ఆర్భాటంగా ప్రకటను అయితే చేసారు.

velagaupud 17012022 2

ముందేమో ఈ పధకానికి 650 కోట్లు ఖర్చు అవుతుందని ఊదర కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదు. దీని గురించి నంద్యాలలో ఏర్పాటు చేసిన మీటింగులో కూడా జగన్ ఈ పదకాన్ని ప్రారంభిస్తారని ,ఇదే విషయాని తమ మీడియాలో కూడా రాయించారు. అయితే ఇప్పుడు డబ్బులు లేక పోవటంతో, ఈ పధకం కూడా వాయిదా పడింది. ఇప్పటికే జనవరికి రావాల్సిన అమ్మఒడి పధకాన్ని ఏవో కారణాలు చెప్పి జూన్ కు వాయిదా వేసారు. అమ్మ ఒడి లాంటి కీలకమైన పధకమే వాయిదా వేసారు అంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం, సెలవులు ఉండటం వల్ల, జీతాలు ఆలస్యం అయ్యాయని, ఈ రోజు నుంచి జీతాలు పడతాయని చెప్తున్నారు. ఇక హడావిడి చేసిన ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సైలెంట్ అయిపోయారు. పీఆర్సీ విషయంలో, చాలా బాగా ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు, ఇప్పటి వరకు జీతాలు రాకపోతే మాత్రం, సైలెంట్ గా ఉండి పోవటంలో ఆశ్చర్యం ఏమి ఉందిలే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read