జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, ఆ పార్టీ శ్రేణులు, అటు సమర్ధించ లేక, ఇటు మద్దతు తెలప లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక అంశం మీద ఎవరైనా మాట మార్చారు అంటే, తెలియక చేసిన తప్పు, సరి చెసుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి అంశం పైనా రచ్చ రచ్చ చేయటం, వెనక్కు వెళ్ళటం, పరి పాటిగా మారింది. ఈ మధ్య కాలంలో మూడు రాజధానుల పై కానీ, శాసనమండలి పై కానీ, అప్పట్లో రకరకాల కారణాలు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో రెచ్చిపోయి గుడ్డలు చించుకుని, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన పేటీయం బ్యాచ్, మళ్ళీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవటంతో, ఎలా సమర్ధించాలో తెలియక తికమక పడుతున్నారు. ఇలా ఒక అంశం అయితే అనుకోవచ్చు, ఈ రోజు తాజాగా మరో అంశం పైన, అది కూడా అతి ముఖ్యమైన అంశం పైన, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గటంతో, అసలు ఈ నిర్ణయాన్ని ఎలా సమర్దిన్చాలో తెలియక, వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తిప్పిన మడమ తిప్పుడు ఏమిటి అంటే, గత ఎన్నికల్లో ఆడ వారి ఓట్లు దండుకున్న మద్య నిషేధం అంశానికి సంబంధించిన, మడమ తిప్పుడు గురించి.

jagan 19122021 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ, తాజాగా మద్యం పైన 20 శాతం వరకు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకా ఇంకా మద్యం అమ్మకాలు పెంచటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మొన్నటి దాకా మద్యం ధరలు పెంచి, ధరలు షాక్ కొట్టే విధంగా పెంచామని, దీంతో తాగటం మానేస్తారని జగన్ చెప్తే, దానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రాచారం కల్పించాయి. నేడు అదే జగన్ ప్రభుత్వం, మద్యం రేట్లు తగ్గించింది అంటే, దానికి ఏమి జవాబు చెప్పాలి ? ఎక్కువ తాగటానికి ధరలు తగ్గించారా అని సమాధానమే వస్తుంది. ఇక మరో పక్క, పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అవుతుందని, అలాగే గ్రామాల్లో నాటు సారా ఎక్కువగా ఉంటుందని, అందుకే రేట్లు తగ్గిస్తున్నాం అని చెప్పటం, ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. అంటే అక్రమ రవాణాని, నాటు సారాని ప్రభుత్వం అరికట్టలేక పోతుందని ఒప్పుకున్నట్టే కదా ? ఇవన్నీ చూస్తున్న వైసీపీ శ్రేణులు, ఎలా దీన్ని సమర్ధించాలో అర్ధం కాక, తల బాదుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read