ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది... ఈ రోజు రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సమాధానం చెప్పింది... విజయసాయి రెడ్డి రెండు ప్రశ్నలు అడిగారు...ఒకటి, స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు, జీఎస్టీ వచ్చిన తరువాత ఎవరికీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు అనే మాట వాస్తవమా కాదా అని, రెండో ప్రశ్న, జీఎస్టీ వచ్చిన తరువాత కూడా, కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ కొనసాగుతుంది అనే విషయం ప్రచారంలో ఉంది, ఇది నిజమా కదా అని ప్రశ్నలు వేస్తె, దానికి ఆర్థికశాఖ సమాధానం చెప్పంది...

hoda 06032018 2

అసలు హోదా అనే మాట ఏ రాష్ట్రానికి లేదని కేంద్రం తేల్చి చెప్పింది... ఏపీకి కూడా హోదా ఇస్తామని చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది... జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఏ రాష్ట్రానికి పన్ను మినహాయింపు ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది... జీఎస్టీలో రాష్ట్రాల వాటా మాత్రమే తిరిగి చెల్లిస్తున్నాం... కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు అంత వరుకే ఇస్తున్నాం.. ఏ రాష్ట్రానికి హోదా కొనసాగించటం లేదు.. అంటూ, రాజ్యసభలో లిఖిత లిఖిత పూర్వకంగా చెప్పింది కేంద్రం...

hoda 06032018 3

మరో పక్క కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు కూడా అవే లీకులు ఇచ్చాయి... ప్రత్యేక హోదా కన్నా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్యాకేజీని మాత్రమే అమలు చేసి మిగిలిన హామీలు సాధ్యం కాదని ప్రకటించాలని ఆ వర్గాలు అంచనాకు వచ్చినట్లు సమాచారం. నిన్న జరిగిన కీలక భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని తెదేపా నేతలు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి చెప్పారు. హోదాకు బదులు ప్యాకేజీ వైపే ఆర్థిక శాఖ మొగ్గుచూపుతోంది... ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇస్తే వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు కూడా డిమాండ్‌ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. నిన్న జరిగిన చర్చలో వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చించాకే పన్ను రాయితీలు కల్పించే అంశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read