రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. ఢిల్లీ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఫిబ్రవరి 25న, అటు లోక్‌సభ కు, ఇటు, ఏపీ శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. మన రాష్ట్రంలో చివరి విడతలో ఏప్రిల్‌లో పోలింగ్‌ ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి సారి, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత టీడీపీ అభ్యర్ధిని ప్రకటించే వారు. కొన్ని ఇబ్బందులు వల్ల నామినేషన్‌క చివరి రోజు కూడా అభ్యర్ధిని వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మల్యేలలో టెన్షన్‌ మొదలైంది. మొదటి జాబితాలో ఎవరి పేరు ఉంటుందో, ఏ నియోజకవర్గంలో మార్పు ఉంటుందో అనే టెన్షన్ సిటింగ్‌ ఎమ్మెల్యేలలో మొదలైంది.

ticket 20122018 2

ఈ విషయం పై చంద్రబాబు కూడా ఇప్పటికే స్పష్టం చేసారు. ఈ విషయం బుధవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో కూడా పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ నేపధ్యంలో కర్నూల్ జిల్లాలో రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు చంద్రబాబు 2014 నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఆ దిశగా, ఎప్పటికప్పుడు నాయకులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలతో పాటు అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించేందుకు ఇప్పటికే చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

 

ticket 20122018 3

గెలిచే వారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ముందుగానే అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈసారి కొందరికి సిటింగ్‌లకు అవకాశం ఉండకపోవచ్చనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. చంద్రబాబు వివిధ సర్వేల ఆధారంగా నంద్యాల, కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో ఇద్దరు, ముగ్గురు సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. అయితే పేర్లు బయటికి చెప్పడం లేదు. చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఆధారంగా ప్రజల్లో వ్యతిరేకత వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిలు ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో అక్కడ ఇన్‌చార్జికి అవకాశం ఉండదు. మిగిలిన ఐదు స్థానాల్లో తమకే అవకాశం ఉంటుందని ఇన్‌చార్జిలు ధీమాగా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read