డీజెల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలన్న డిమాండ్‌తో లారీల యజమానులు చేపట్టిన బంద్‌ ఆరు రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనాలేదు. ఓ వైపు పార్లమెంట్‌ జరుగుతోంది. ఇందులో అనేక అంశాలు చర్చకొస్తున్నాయి. కానీ లారీల సమ్మె ప్రభావం గురించి ఏ ఒక్కరు అడిగిన పాపాన పోలేదు. కనీసం దీనివల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా చర్చ లేదు. ఇప్పటికే రవాణా స్తంభనతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి మందగించింది. ముడిసరుకుల రవాణా నిలిచిపోవడంతో కార్మికుల కు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. చేపలు, గుడ్లు, కొబ్బరి వంటి వాటి ఎగుమతులు ఆగిపోయాయి. లారీలు స్తంభించడంతో రైల్వేయార్డులు కూడా బోసిపోతున్నాయి. గూడ్స్‌ల రవాణా కూడా పడిపోయింది. పోర్టుల్లో రవాణాపై ఇప్పటికే ప్రభావం ఏర్పడింది. సాధారణ మార్కెట్లలో కూరగాయల లభ్యత తగ్గిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ట్యాంకర్ల యాజమాన్య సంఘాలు కూడా లారీల సమ్మెకు మద్దతు పలికాయి.

loksabha 26072018 2

ఇక ట్యాంకర్లలో రవాణా అయ్యే డీజెల్‌, పెట్రోల్‌ల లభ్యత కూడా తగ్గిపోతున్నది. ఇది జనజీవనాన్ని మరింత అతలా కుతలం చేస్తుంది. అయినా ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి స్పందనాలేదు. మహారాష్ట్రలో మరాఠాల ఆందోళన పై ఒకరోజు తిరిగేసరికి ప్రభుత్వం దిగొచ్చింది. వెంటనే చర్చలకు నడుంకట్టింది. కానీ దేశ వ్యాప్త ప్రభావం చూపుతున్న లారీల సమ్మెవైపు దృష్టి పెట్టడం లేదు. సమ్మె ప్రభావంతో సిమెంట్‌, ఇసుక, ఇనుముల రవాణా నిల్చిపోయింది. ఇది నిర్మాణ రంగం పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో వ్యవసాయం తర్వాత నిర్మాణరంగమే అత్యధిక సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. పైగా వీరంతా రోజువారి వేతనదారులే. ఏ రోజు పనుంటే ఆ రోజే వీరికి వేతనం లభిస్తుంది. పనిలేక పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి ఇప్పుడు వీరికి ఏర్పడింది. వంటనూనెల నుంచి ఉల్లిగడ్డల వరకు నిల్వలు తగ్గిపోయాయి.

loksabha 26072018 3

దేశవ్యాప్తంగా పోర్టుల్లో రవాణా స్తంభించినా కేంద్రం మాత్రం స్పందించడం లేదు. పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు. అన్నిరకాల వస్తువుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చి గరిష్టంగా 28శాతం పన్ను వసూలు చేస్తుంటే డీజెల్‌పై కేంద్రం 47శాతం పన్ను వసూలు చేస్తోంది. ఇదికాక సెంట్రల్‌ ఎక్సైజ్‌ అంటూ మరో 11శాతం రాబడుతోంది. ఈ ఆదాయాన్ని వదులు కోలేక లారీల బంద్‌పై కేంద్రం దృష్టి పెట్టడంలేదు. కనీసం సామరస్య పూర్వకంగా నైనా సమ్మె ఉపసంహరణకు ప్రయత్నించడం లేదు. లారీ యజమా నులు, కార్మికుల ఆర్థిక దుస్థితి తెలిసినా చచ్చేట్లు వారే దిగొస్తారన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోంది. ఇది అన్నివర్గాల ప్రజల ఆగ్రహానికి కారణమౌతోంది. ఇప్పటికైనా కేంద్రం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, కనీసం పార్లమెంట్‌లో దీనిపై ఓ ప్రకటన చేయాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెల విషయంలో కార్మికుల ప్రయోజ నాలకు అనుకూలంగా వ్యవహరించాల్సిన వామ పక్షాల పార్లమెంట్‌ సభ్యులు కూడా ఈ సమ్మెపై స్పందించక పోవడం మరింత విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read