వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి హడావిడి చేస్తుంది. 137 కార్పొరేషన్లకు పదవులు ఇచ్చామని, ఇందులో సామాజిక న్యాయం చేసాం అని, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలకు 56శాతం పోస్టులు ఇచ్చామని, మహిళలకు 50 శాతం పోస్టులు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అసలు ఈ లెక్కలు చూస్తూ, ఈ పదవులు ఎందుకు ఇచ్చారో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు అయిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్‌, మారిటైం బోర్డ్‌, సివిల్‌ సప్లైస్‌, పోలీస్‌ హౌసింగ్‌, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లు అన్నీ ఒకే సామజికవర్గం చేతిలోకి వెళ్ళాయి. ఈ పోస్టులు భర్తీ పై వైసీపీలో కూడా తీవ్ర అసంతృప్తి ప్రారంభం అయ్యింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కూడా వైసీపీ అసంతృప్తులు మొదలయ్యాయి. షేక్ కార్పొరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఈ పదవి మాకు అవసరం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఇక విజయవాడలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్ పలానా వ్యక్తి వస్తుంది అంటూ లీకులు ఇచ్చారు. అతను ఫ్లెక్సీలు కూడా వేయించారు. అయితే ఆ పదవి వేరే వారికీ రావటంతో, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ విధంగా పోస్టులు ప్రకటించిన తరువాత, అనేక చోట్ల అసంతృప్తులు మొదలయ్యాయి.

nominated 18072021 2

అయితే ఇక మరో పక్క ఈ 137 పోస్టుల్లో, గిరిజనులకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవటంతో, గిరిజన సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటంతో, నిన్న సాయంత్రానికి గిరిజనులకు మరో రెండు పోస్టులు సృష్టించి, ముందుగా ప్రకటించిన 135 కాకుండా, దాన్ని 137 పోస్టులకు మార్చారు. ఇక వివిధ అకాడమీలు, సంగీత, సాహిత్య, నృత్య, జానపద అకాడమీ అనే దాన్ని, అయుదు విభాగాలుగా మార్చి పదవులు ఇచ్చారు. అసలు ఎక్కడ ఉందో తెలియని హిస్టరీ అకాడమీ అనే దాన్ని సృష్టించారు. సోషల్ జస్టిస్ అనే ఒక కొత్త కార్పోరేషన్ ను సృష్టించారు. అలానే స్మార్ట్ సిటీ కాని రాజమండ్రిని, రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ అని పదవి సృష్టించారు. ఏలేశ్వరం అనే నగర పంచాయతీకి డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే స్మార్ట్ సిటీ చైర్మెన్లుగా అధికార యంత్రాంగం ఉంటుందని కేంద్రం చట్టంలో చెప్పింది, దాన్ని కూడా తుంగలోకి తొక్కారు. ఈ విధంగా అసలు ఎందుకు ఇవి ప్రకటించారో, దేని కోసం ప్రకటించారో, వీరికి ఆఫీస్ లు, నిధులు అయినా ఇస్తారో లేదో అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి, ఇది కూడా వైసీపీ చేస్తున్నట్టే, హడావిడి తప్ప విషయం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read