వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర పోలీసులు భగ్గుమంటున్నారు. ఆ పార్టీ నే తలు సీఈసీకి చేసిన ఫిర్యాదుపై మండిపడుతున్నారు. ‘‘వైసీపీ నేత ఫిర్యాదులో నాన్‌కేడర్ అధికారులు ఎస్పీ లుగా ఉండడానికి వీల్లేదని, వెంటనే మార్చాలని కోరా రు. ఇది చాలా దారుణం. ఎవరైనా తప్పు చేస్తే మార్చా లని కోరతారు. లేదా పక్షపాత వైఖరి ఉంటే ఫిర్యాదు చేస్తారు. నాన్‌కేడర్ అన్న ఒకే ఒక్క కారణంతో శ్రీ కాకుళం, విజయనగరం ఎస్పీల బదిలీ కోరడం అవమానకరం. నాన్‌కేడర్ అంటే లోకువా? అధికారుల్లో కేడర్ విభజన తీసుకురావడం అంటే యూనిఫామ్ సర్వీసును తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడమే. ఇలాంటి చర్యలను ఎ వరూ అనుమతించకూడదు. కానీ, ఈ ఫిర్యాదు ఆధా రంగా శ్రీకాకుళం ఎస్పీని బదిలీ చేయమని ఆదేశించడం అధికారుల్లో అసమానతలున్నాయని తేల్చిచెప్పడమే అవుతుంది.
దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి అన్నారు. తమను అవమానపరిచే లా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు మొ త్తం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి, ప్రతిష్ఠను దిగజార్చడానికి చేసినట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తుతు న్నారు. తప్పుచేసిన పోలీసులపై చర్య తీసుకుంటే అ భ్యంతరం లేదని.. పదుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదులపై అ త్యున్నత సంస్థలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని వాపోతున్నారు. వ్యవస్థలేవీ బతికే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని కోరే పార్టీలను చూశాం కానీ.. పోలీసులకు ఇచ్చిన పదోన్నతులు, పోస్టింగ్‌లకు రాజకీయ కోణం అద్ది తమను రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చే యడం గర్హనీయమని అంటున్నారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న పోలీసుల మధ్య కేడర్-నాన్‌కేడర్ విభజన తీసుకొచ్చి తమను రాజకీయాలకు బలిచేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థలో డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని స్థాయిల ఉద్యోగుల సర్వీసు అంశాలు, పోస్టింగ్‌లను రాజకీయం చేయడం దురదృష్టకరమని అంటున్నారు. సాయిరెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
పోలీసు శాఖలో పదోన్నతులు అనేది ఓ బ్రహ్మ పదా ర్థం. కానిస్టేబుల్‌గా నియమితులైన వారు హెడ్‌కానిస్టేబుల్ అవ్వడమనేది ఒక కలగానే మిగిలిపోయేది. యూ నిఫామ్ సర్వీసులో టైమ్‌బౌండ్ పదోన్నతులు లేని కారణంగా ఎంతోమంది నియమితులైన పోస్టులోనే రిటైర్ అయ్యేవారు. ఇటీవలే ప్రభుత్వం ఈ విధానాకి స్వస్తిపలికి ఎంతో మందికి పదోన్నతులు కల్పించింది. ప్ర భుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల వేలాది మంది పోలీసుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పదోన్నతు లు ఇచ్చారని, పోలీసు శాఖ రాజకీయమైందని ఫిర్యాదు చేయడం గర్హనీయమని పోలీసులు అంటున్నారు. సర్వీసులో మచ్చలేనివారు, నీతి, నిజాయతీకి ప్రతిరూపమైన అధికారులకు కులం, మతాన్ని ఆపాదించి అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అంటూ పోలీసులు, ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి పారదర్శకంగా పనిచేయకుండా అడ్డుకునేందుకే విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్య క్తం చేశారు.