పోలవరం ప్రాజెక్ట్ ఒక మిషన్ గా తీసుకుని, ప్రతి సోమవారం సమీక్ష చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది నాటికి పోలవరం నీటిని విడుదల చేయాలని భావిస్తున్న చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మొదటి నుంచి పోలవరం పనుల్లో జాప్యం వహిస్తూ వస్తున్న, ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌కు నోటీసులు ఇచ్చింది. ట్రాన్‌స్ట్రాయ్‌కి 60-సి కింద నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. న్యాయ పరమైన చిక్కులు కూడా రాకుండా, వేరే సంస్థలకు పనులు అప్పగించటానికి మార్గం సుగుమం అయ్యింది. ట్రాన్‌స్ట్రాయ్ చేయలేని పనులను వేరే సంస్థలకు పనులు అప్పగించడం వల్ల నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమమం అవుతుంది.
ఇప్పటికే L&T, Bauer, Putzmeister,Triveni Engineering లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పోలవరంలో పని చేస్తున్నాయి. ట్రాన్‌స్ట్రాయ్ ని తీసివెయ్యటంతో, ఇప్పుడు మేఘ ఇంజనీరింగ్ కు ఆ పనులు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మేఘా కు రికార్డు టైంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి పూర్తి చేసిన ట్రాక్ రికార్డు ఉండటంతో, ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ త్వరతిగతిన పూర్తి చెయ్యటానికి, మేఘా వైపు మొగ్గు చూపుతుంది...