టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ హరీష్ కు ఈసీ నోటీసులు అంద‌జేసింది. గత నెల రోజులుగా నోటికి ఇష్టం వచ్చినట్టు తెరాస నేతలు, చంద్రబాబు పై మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏకంగా పబ్లిక్ మీటింగ్స్ లో చంద్రబాబు పై బూతులు తిడుతూ ప్రసంగాలు చేసారు. ఇది చుసిన తెరాస నేతలు మరింత రెచ్చిపోయి, చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పై రాజకీయ విమర్శలు కాకుండా, పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉండటంతో, టిడిపి నాయకులు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు.

kcr 10112018

తెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు రాజకీయ దురుద్దేశంతో పలు వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు హరీశ్‌ లేఖ రాసి విడుదల చేసిన సమయంలో చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రావడం ఆయనకు ఇష్టం లేదని హరీశ్‌రావు పేర్కొనడానికి తెదేపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి కాశీనాథ్‌, అజ్మీరా రాజునాయక్‌లతో కలసి శుక్రవారం రేవూరి ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలను బాబు అడ్డుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

kcr 10112018

ఎన్నికల కోసం ఈ సమయంలో సెంటిమెంటును రాజేసి చంద్రబాబును తెలంగాణ శత్రువుగా చూపాలని హరీశ్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను చెప్పే మాటలను కేసీఆర్‌ నమ్మాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలా బాబు పై మంత్రి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆయన పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేవూరి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read