జగన్ మోహన్ రెడ్డి తల్లి, వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు అయిన, వైఎస్ విజయమ్మకు, అలాగే జగన్ సోదరి అయిన షర్మిలకు, ప్రత్యెక కోర్ట్ సామన్లు జారీ చేసింది. 2012 ఉప ఎన్నికల సమయంలో, జరిగిన ఎన్నికల ప్రచారంలో, ఎలాంటి అనుమతి తీసుకోకుండ, రోడ్డు పై ఎన్నికల సభ పెట్టటంతో, విజయమ్మ, షర్మిల, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ, 2012లో పోలీసులు కేసు నమోదు చేసారు. 2012 ఎన్నికల సమయంలో, తెలంగాణాలోని పరకాలలో అప్పట్లో, ఈ సంఘటన జరిగింది. అయితే, ఇదే సందర్భంలో, విజయమ్మ, షర్మిలతో పాటుగా, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా, కోర్ట్ నోటీసులు ఇచ్చింది. 2012లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యకుండా, జగన్ పార్టీలో చేరారు. దీంతో వారి పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా, జగన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్పించుకోవటంతో, కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుతో, ఈ ఎమ్మేల్యేల పై అనర్హత వేటు పడింది.
దీంతో అప్పట్లో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం, తెలంగాణాలోని పరకాలలో కొండా సురేఖ వైసీపీ అభ్యర్ధిగా పోటీలో నిలబడ్డారు. ఆవిడ తరుపున ప్రచారం చెయ్యటానికి, వచ్చారు విజయమ్మ, షర్మిల. ఆ సమయంలో జగన్ సిబిఐ కేసులో జైలులో ఉండటంతో, ఆయన తరుపున విజయమ్మ, షర్మిల వచ్చారు. అయితే వారు సభ పెట్టిన చోట పర్మిషన్ లేకపోవటం, ముందస్తు అనుమతి తీసుకోక పోవటంతో, వారి పై, పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. అయితే, అక్రమాస్తుల కేసులో అదే రోజు కోర్టుకు సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇక, 2012 లో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్..టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తెలంగాణలోని పరకాల నుండి కొండా సురేఖ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ప్రచార సమయంలో జరిగిన వ్యవహారం పైన ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో సురేఖ..టీఆర్ యస్ అభ్యర్ధి బిక్ష్మయ్య మధ్య హోరా హోరీ పోటీ సాగింది. అయితే అప్పటి నుంచి ఆ కేసు వరంగల్ లో జరిగింది.
కొన్నేళ్ళు క్రిందట, ఈ కేసు వరంగల్ నుంచి, హైదరాబాద్ లోని, ప్రత్యేక కోర్ట్ కు ఈ కేసు బదిలీ అయ్యింది. అయితే ఈ విషయం పైనే, ప్రత్యేక కోర్ట్, వారికి సమన్లు జరీ చేసింది. ఈ నెల 10న షర్మిలతో పాటుగా, విజయమ్మను కూడా కోర్ట్ కు రావాలి అంటూ సమన్లు జారీ అయ్యాయి. అయితే అదే జనవరి 10న, జగన్ కూడా సిబిఐ కోర్ట్ కు హాజరు కావలి అంటూ, సిబిఐ కోర్ట్ కూడా, రెండు రోజుల క్రిందట ఆదేశాలు జారీ చేసింది. ఆయన గత ఏడు నెలలుగా, ఆయన ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళకుండా, వస్తున్నారు. అయితే ఈ విషయం పై, మొన్న శుక్రవారం ఈ విషయం పై సీరియస్ అయ్యింది. ఇక ప్రతి శుక్రవారం జగన్, విజయసాయి రెడ్డి రావాల్సిందే అని, ఈ నెల 10న తప్పుకుండా రావాలని కోరింది. అయితే, ఇప్పుడు విజయమ్మ, షర్మిలను కూడా హైదరాబాద్ లోని ప్రత్యెక కోర్ట్ కూడా, అదే రోజున కోర్ట్ కు రమ్మని నోటీసులు ఇవ్వటం, యాదృచ్చికమే అనుకోవాలి.