తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను, అధికార పార్టీ, ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎలాగైనా టిడిపిని ఇబ్బంది పెట్టాలని, ఇప్పుడు గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసారు. ఇందులో భాగంగా, వారి ఎన్నిక చెల్లదు అంటూ, వైసీపీ నేతలు కోర్ట్ కు వెళ్లారు. దీంతో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలకు నిన్న హైకోర్టు నోటీస్ జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు టిడిపి ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావులకు కూడా హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. గల్లా జయదేవ్‌ తో పాటుగా, ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావు ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో వైసీపీ నేతలు దాఖలైన పిటిషన్‌లో భాగంగా హైకోర్ట్ వీరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబుతో సహా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు, హైకోర్ట్ ఇలాంటి నోటీసులే ఇచ్చింది. చంద్రబాబు సియంగా ఉంటూ జీతం తీసుకుని, అది చూపించలేదు అంటూ, ధాఖలైన పిటీషన్ పై, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.

gadde 26102019 2

ఇప్పుడు తాజగా, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, నిన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావుకు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసారు. మొన్న జరిగిన ఎన్నికల్లో, మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా 4200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా జయదేవ్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని వైసిపి ఆరోపిస్తుంది. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో మతలబు జరిగింది అంటూ మోదుగులు ఆరోపిస్తున్నారు.

gadde 26102019 3

ఈ విషయం పైనే కోర్ట్ కు వెళ్లారు. పోస్టల్ బ్యాలట్ విషయంలో కలెక్టర్ సరిగ్గా వ్యవహరించలేదని, మోదుగుల వాదన. అందుకే తాను ఓడిపోయానని, హైకోర్ట్ కు ఇచ్చిన పిటీషన్ విషయంలో, హైకోర్ట్, గల్లాకు నోటీసులు జరీ చేసింది. ఇక పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలుపుని కూడా సవాల్ చేస్తూ, వైసీపీ నాయకుడు సత్యనారాయణ మూర్తి తరుపున వాసుదేవ రావు హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. అలాగే, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ మూడు పిటీషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. దీని పై గల్లా, ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావు , హైకోర్ట్ కి సమాధానం ఇవ్వనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read