ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు మంత్రి విడదల రజినీకి షాక్ ఇచ్చింది. చిలకలూరిపేటలో జరుగుతున్న అక్రమ గ్రానైడ్ తవ్వకాల విషయంలో హైకోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ లో గ్రానైడ్ తవ్వకాలు జరుపుకోవచ్చు అంటూ, ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయం పై, హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ స్థలంలో గ్రానైట్ తవ్వకాలు జరుపుకోవచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వటం పై, రైతులు అభ్యంతరం చెప్తూ, హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రిట్ పిటీషన్ ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మంత్రి విడదల రజినీతో పాటుగా, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.అక్కడ ఉన్న అసైన్డ్ రైతులను బెదిరించి మరీ అనుమతి ఇచ్చారని రైతులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ రిట్ పిటీషన్ పై నోటీసులు ఇచ్చిన హైకోర్టు, ఈ పిటీషన్ తీర్పుకి లోబడే లీజు ఉంటుందని స్పష్టం చేస్తూ, కేసుని మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read