నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కీలక ప్రాంతమైన, విజయవాడలో మొదటి ఫైవ్ స్టార్ట్ హోటల్ రెడీ అవుతుంది. అదేంటి, ఇప్పటి దాక విజయవాడకు ఫైవ్ స్టార్ హోటల్ లేదా అని ఆశ్చర్యపోతున్నారా ? ఏమి చేస్తాం అండి అన్నీ మనమే నిర్మించుకుందాం. ఇప్పటికే బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకు వెళ్ళే సర్వీస్ రోడ్ లో, వినాయక్ ధియేటర్ ఎదురుగ నోవాటెల్‌ ఫైవ్ నక్షత్రాల స్టార్‌ హోటల్‌ నిర్మాణంలో ఉంది. నోవాటెల్‌ మొత్తం 16 ఫ్లోర్స్ లో కడుతున్నారు. ఈహోటల్‌లో సకల సౌకర్యాలు గల 110 గదులు ఉంటాయి. వరుణ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ హోటల్‌ నిర్మాణం జరుగుతుంది.

novotel 19102018 2

ఇప్పటికే చాలా వరకు పనులు అయిపోయాయి, త్వరలోనే ప్రారంభిస్తారని వరుణ్‌ గ్రూప్‌ చెప్తుంది. ఇంటీరియర్ అంతా రెడీ అయిపొయింది. బయట చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నోవాటెల్‌ ఫైవ్ స్టార్ట్ హోటల్‌ విజయవాడకు ప్రథమ ఆకర్షణగా ఉండనుంది. అమరావతి పరిధిలో గుంటూరు, విజయవాడ పరిధిలో మరిన్ని ఫైవ్ స్టార్ట్ హోటల్స్ రానున్నాయి.. ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. కొన్ని ఇప్పటికే, నిర్మాణాలు కూడా మొదలుపెట్టాయి.

novotel 19102018 3

అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read