రాజధాని అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తసుద్ధి లేకపోవటంతో, ప్రతిష్టాత్మక నిర్మాణాల పై దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే సింగపూర్ కన్సార్షియం కొనసాగింపు పై సందిగ్ధత నెలకొన్న సమయంలో, అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఐకానిక్ టవర్ పై సస్పెన్స్ నెలకొంది. వివిధ దేశాల్లో ఉన్న ఆంధ్రా ప్రాంత ప్రజలు, అమరావతిలో 33 అంతస్తులతో ఒక ఐకానిక్ టవర్ కట్టాలని నిర్ణయం తీసుకుని, భూమి కూడా కొని, అప్పటి ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఆ టవర్ల నిర్మాణం కోసం అడ్వాన్సులు ఇచ్చిన ఎన్ఆర్ఐలు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని, ప్రభుత్వం దగ్గర పట్టుబడుతున్నారు. ఈ ఐకానికి టవర్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఏపీఎన్‌ఆర్టీ, వీరి ఒత్తిడితో, ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో ఉంది. అమరావతి మార్పు అనేది జరగదని, ప్రభుత్వానికి అలంటి ఆలోచన లేదని, ఆర్ధిక స్థితి సరిగ్గా లేకే, అమరావతి పై ఆచితూచి ప్రభుత్వం వెళ్తుందని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
వీరు ఎంత సముదాయించటానికి ప్రయత్నించినా, అమరావతి పై సందిగ్ధస్ధితి తొలగిపోలేదమో, ప్రభుత్వ పెద్దలే ఇప్పటి వరకు మాట్లడలేదని ఎన్ఆర్ఐలు అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, సీపీఎం, సీపీఐలు రాజధాని ప్రాంతంలో పర్యటనలు జరిపి అమరావతిని మార్చవద్దు అని వేడుకుంటున్నా, సియం స్పందించలేదని, స్పష్టమైన ప్రకటన చెయ్యలేదని అంటున్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐలు నుంచి రూ.34 కోట్లు అడ్వాన్స్‌ల రూపంలో వచ్చినట్టు తెలుస్తుంది. వీటితో, భూమి కొనుగోలు, వివిధ రకాలైన అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులు, కేపీఏంజీ వంటి ఆర్కిటెక్ట్‌లకు ఇప్పటికే కొన్ని చెల్లించినట్లు ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో, ఇప్పుడు అడ్వాన్స్ తిరిగి ఇవ్వటం సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్ను. అడ్వాన్స్ లు ఇచిన ఎన్ఆర్ఐలతో కొంతమంది ప్రభుత్వ పెద్దలు, అధికారులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి, అక్కడ ఏమి జరగనప్పుడు, ఇంకా ఎందుకని, తమ డబ్బు తమకు ఇచ్చేయాలని కోరుతున్నారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందితే, ఈ ఐకానికి త్వోఎర్ లో , ఎన్నో ఐటి, ఇతర కంపెనీలు వస్తాయని అనుకున్నామని, కాని, అమరావతిలో ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు జరుగకుండా కేవలం ఐకానిక్ టవర్లు నిర్మించినప్పటికీ ఏ విధమైన ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐలు కోరుతున్న విధంగా వారి డబ్బు తిరిగి ఇచ్చివేస్తే అది ఇతర పెట్టుబడిదారులలో తప్పుడు సంకేతాలను దారితీసే ప్రమాదం వున్నదని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.