ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నగరంలోని రాయపూడిలో, రేపు ఐకానిక్ టవర్ కు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10గంటలకు రాయపూడిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ సైట్‌లో ప్రాంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు పాల్గొంటారని గుంటూరు జిల్లా అధికారవర్గాలు తెలిపాయి. ప్రవాస తెలుగు ప్రజలు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ఐకాన్‌.ఏపీఎన్‌ఆర్‌టీ.కామ్‌ వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించింది. ఐకాన్‌ కోసం పేర్లను నమోదు చేసుకొనేందుకు, మెంబర్‌గా రిజిస్టర్‌ అయ్యేందుకు ఆప్షన్స్‌ని అందుబాటులో ఉంచింది.

iconitower21062018 2

ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి సంబంధించిన మొట్టమొదటి ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టుగా ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ని సంస్థ పేర్కొంటోంది. మల్టిపుల్‌ బ్లూచిప్‌ కంపెనీలకు ఈ ఐకాన్‌ గుడారంలా ఉంటుంది. 2000 నుంచి 3000 మంది ఎక్కువ వేతనాలను పొందే ఉద్యోగులను అమరావతి రాజధాని నగరానికి ఈ ఐకాన్‌ తీసుకొస్తుంది. ఇక్కడ లభించే ఉద్యోగాలు అంతర్జాతీయ స్థాయిలో ఖర్చులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు తీసుకొస్తుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్కు ఉండదు. ఈ ప్రాజెక్టుకు ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీతోపాటు ఏపీ ప్రభుత్వం ప్రమోటర్లుగా ఉన్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ ప్రాజెక్టులో బహిరంగ ప్రదేశాలు, కన్వెన్షన్‌ హాల్స్‌, ఆఫీసులు, సమావేశ మందిరాలు, గార్డెన్‌ అపార్టుమెంట్స్‌, సూట్స్‌, టెర్రాస్‌ గార్డెన్‌, ఇన్‌ఫినిటీ పూల్‌, స్పా, చుట్టూత తిరిగే రెస్టారెంట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు.

iconitower21062018 3

33 అంతస్తులలో ఐకాన్‌ టవర్‌ ఉంటుంది. ఇది రాజధానికే ఒక వజ్రంలా ఉంటుందని సొసైటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానదికి మధ్యన ఉండటం వల్ల ప్రకృతి ఒడిలో ఇమిడినట్లుగా ఉంటుంది. 33వ అంతస్తులో రూఫ్‌టాప్‌ పూల్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌ ఉంటాయి. ప్రైవేటు కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, జిమ్నాజియం కూడా ఉంటాయి. ఐకాన్‌ చుట్టూత ఇన్‌సులార్‌ స్కిర్ట్‌ ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. రూప్‌ టాప్‌ గార్డెన్స్‌తో సహజసిద్ధమైన చల్లదనం అమరుతుంది. నీటిని పొదుపు చేసేందుకు కూడా ప్రాజెక్టులు చేపడతారు. సోలార్‌ విద్యుత్‌తో కార్బన్‌ ఎమిషన్స్‌ ఉండవు. రివర్‌ఫ్రంట్‌లో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు స్పెషాలిటీ కియోస్క్‌లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో సంస్థకి 4,500 ఎస్‌ఎఫ్‌టీని కేటాయిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read