కన్ను మిన్ను కాన రాక, అధికార అహంతో, నోటికి ఏమి మాట్లడతున్నమో తెలుసుకోకుండా, రెచ్చిపోతున్న బీజేపీ నాయకులకు ఎక్కడకు వెళ్ళినా ఆంధ్రులు వదిలిపెట్టటం లేదు.. మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అంటూ, నిలదీస్తున్నారు... సాక్షాత్తు అమిత్ షా కే, తిరుపతిలో ఈ నిరసన తగిలింది... అయితే తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు, ఈ నిరసన సెగ తాకింది. మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని, ఎగతాళి చేసింది ఈయనే... ఇలా ఆంధ్రా పై అడ్డగోలుగా వాదించినందుకు, బహుమానంగా, రాజ్యసభ ఇచ్చి సత్కరించారు అమిత్ షా... అందుకే ఆ విశ్వాసం చూపిస్తూ, ఆంధ్రా పై మరింతగా విరుచుకు పడుతున్నాడు జీవీఎల్... సరిగ్గా కర్ణాటక ఎన్నికల ప్రచార హడావిడి ముగిసిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు చుక్కలు చూపిస్తాం అంటున్నారు..
ఈ నేపధ్యంలో, అమెరికాలో, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో బీజేపీ ఒక కార్యక్రమం నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభ లాగా దీనిని నిర్వహించారు. దీనికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను ఆహ్వానించారు. ఆయన ఎప్పటిలాగానే.. ప్రత్యేకహోదా వంచన విషయంలో పాచిపోయిన పాట పాడడం ప్రారంభించారు. హోదా ను మించిన ప్యాకేజి ఇస్తున్నామని, చంద్రబాబు తీసుకోవడం లేదని, నానా అవాకులు చెవాకులు పేలడం ప్రారంభించారు. ఈ వరుస అబద్దాలను సహించలేకపోయిన సభికులైన ప్రవాసాంధ్రులు లేచి నిల్చుని, మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ నిలదీశారు.
సభలో గందరగోళం చెలరేగింది. “ఈ నిరసనలు కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవే అని, మీరు అందరూ దుష్ప్రచారపు మాయలో పడుతున్నారని” నరసింహారావు కాసేపు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పాచిక కూడా పారలేదు. ఈలోగా నరసింహారావు బుకాయింపులను అడ్డుకున్న వారిని బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. “గత ఎన్నికల్లో మేము కూడా మోడీ మాటలను నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం. అందువల్ల మా మిత్రులను కూడా కోల్పోయాం. కానీ మీరు తెలుగు జాతిని వంచించారు” అంటూ పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ తాకిడి తట్టుకోలేకపోయిన నరసింహారావు తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. మొత్తానికి ఆంధ్రా వారికి ద్రోహం చేసి, ఎదురు చుక్కలు చూపిస్తాం అంటున్న బీజేపీకి, ఎక్కడకు వెళ్ళినా చుక్కలు కనిపిస్తున్నాయి..