ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏల విషయంలో వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అటు కోర్టుల్లోనూ, ఇటు కేంద్రం వద్ద, మరో పక్క వివిధ దేశాలు కూడా జగన్ సర్కార్ తీరు పై అభ్యంతరం చెప్తున్నాయి. సహజంగా విద్యుత్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలతో 20-25 ఏళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అయితే ఇలాంటి ఒప్పందాలను సమీక్షిస్తే, కంపెనీలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు వెనకడుగు వేస్తారు. అలా అని రాష్ట్రం నష్టపోకూడదు. అయితే పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బ తియ్యకూడదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందలాను, కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం సమీక్ష చేస్తాను అని చెప్పటంతో, ఇండస్ట్రీలో కలకలం రేగింది. దాదాపుగా 40కి పైగా కంపెనీలు హైకోర్టుకు వెళ్ళాయి. కోర్టు కూడా వీరికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఇక కేంద్రం కూడా ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ లాంటి దేశాలు, ఏపి ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చెయ్యటంతో, కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది. అన్ని ఒప్పందాలను సమీక్ష చెయ్యం అని, ఎక్కడైతే అవినీతి జరిగిందనే సమాచారం ఉందో అక్కడే చేస్తాం అని చెప్పింది.

ntpc 01092020 2

ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా షాక్ ఇచ్చింది. ఎన్టీపీసీతో 2008లో, 2010లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు విద్యుత్ చాలా చౌక అయిపోయిందని, ఆ రేటుకు మేము ఇవ్వలేమని, ఎన్టీపీసీతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి లేఖ రాసింది. అయితే ఎన్టీపీసీ తాజగా దీనికి నో అని చెప్పేసింది ఇప్పటికే గతంలో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ ఒప్పందాలను గౌరవించాల్సిందే అని చెప్పటంతో, కేంద్రానికి చెందిన ఎన్టీపీసీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి అదే సమాధానం చెప్పింది. దీంతో ఎన్టీపీసీతో ఒప్పందం రద్దు చేసుకుందాం అనుకున్న ఏపికి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఒప్పందాల పై వైఖరి ప్రదర్శిస్తూ ఉండటంతో, కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక బిల్లుని తీసుకువచ్చే ప్రయత్నాలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక రకంగా చూసుకుంటే ఇలాంటి చర్యలు పెట్టుబడి వాతావరణం దెబ్బ తీసెదే అయినా, రాష్ట్ర ప్రభుత్వాల పై పడే భారం కూడా చూసుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read