జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఆయ‌న మాట్లాడాల్సిన సంద‌ర్భంలోనూ మాట్లాడ‌డు. ఆయ‌న త‌ర‌ఫున ఆయ‌న ఫ్యాన్స్ మాట్లాడుతుంటారు. చంద్ర‌బాబు స‌భ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని టిడిపి ప‌గ్గాలు జూనియ‌ర్ కి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తుంటారు. ఆ డిమాండ్లు..ఆందోళ‌న‌లు వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి సాక్షి మీడియా, దాని అనుబంధ సంస్థ‌లైన ఎన్టీవీ-టీవీ9లో వ‌స్తుంటాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఆయ‌న త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని వైసీపీ నేత‌లు, టిడిపి నాయ‌క‌త్వం ఆయ‌న‌కి ఇవ్వాల‌ని మైకులు విర‌గ్గొడుతుంటారు. తాత అంటే ప్రాణ‌మంటూ ఫుల్ పేజీలు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే తాత పోలిక‌లున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న తాత‌ తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్స‌వాల‌కి డుమ్మా కొట్టేశాడు. ఆయ‌నేదో ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేక‌పోతున్నాన‌ని చెప్పినా, జూనియ‌ర్ మ‌న‌సులో మాట‌ల‌ని సాక్షి మీడియాలో అచ్చేశారు. ఆ రాత‌ల‌ని ఆయ‌న ఖండించ‌రు అంటే, ఆయ‌నే మ‌న‌సెరిగి రాస్తున్న‌ట్టే క‌దా! తాను రాలేన‌ని ఇన్విటేష‌న్ ఇచ్చిన‌ప్పుడే సావనీర్ కమిటీకి చెప్పాన‌ని జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, ఆయ‌న అభిమానుల కోసమే ప‌నిచేస్తున్న‌ట్టు వ్య‌వ‌హ‌రించే సాక్షి, దాని అనుబంధ మీడియాలో మాత్రం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న వేడుక‌ల‌కి ఇష్టంలేకే గైర్హాజ‌ర‌య్యార‌ని ఒక రోత రాత రాశారు. ఎన్టీఆర్ శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో తొలి సభను విజయవాడలో నిర్వహించి, జూనియ‌ర్‌ని పిల‌వ‌లేద‌ని...అందుకే రెండో సభను హైదరాబాద్‌లోని కైత్లాపూర్ మైదానంలో నిర్వ‌హిస్తున్న స‌భ‌కి డుమ్మా కొట్టార‌ని వైసీపీ మీడియా రాసుకొస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న వేదిక పంచుకోవ‌డానికి ఇష్టం లేకే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వైసీపీ పేటీఎం వెబ్సైట్ల‌లో రాస్తున్నారు. దీనిపైనా ఎన్టీఆర్ స్పందించ‌డు. ఆయ‌న వాయిస్‌ని సాక్షి, వైసీపీ వినిపిస్తుంది. అది ఆయ‌న ఖండించ‌డు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read