అమెరికాలో ఆంధ్ర తేజం విగ్రహమై అలరించనుంది. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకం అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు సంఘం వారు కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎడిషన్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి అంగీకరించారు. అమెరికాలోని ఓ నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు కానున్న మొట్ట మొదటి విగ్రహం ఎన్టీఆర్ దే. నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు నిధులు, స్థలం ఎంపిక, అనుమతులు సాధించడం వంటివన్నీ పూర్తి అయ్యాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు, తెలుగు భాష వికాసానికి, మన సాహిత్యం, కళలు భావితరాలకు అందించడానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కలని సాకారం చేసిన అసోసియేషన్ ప్రతినిధులను ప్రవాస తెలుగువారు అంతా అభినందిస్తున్నారు.
అమెరికాలో అన్న ఎన్టీఆర్ కి అరుదైన గౌరవం.. తెలుగోడి దమ్ము ఇది...
Advertisements