ఆమె తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కుమార్తె. టెక్ సియంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి భర్త. ఆమె తండ్రి రెండు సార్లు సియం, భర్త మూడు సార్లు సియం, కొడుకు మంత్రిగా చేసారు, సోదరుడు రాజ్యసభలో పని చేసాడు, మరో సోదరుడు ఎమ్మెల్యే. పది వేల మంది పని చేసే కంపెనీకి అధిపతి. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, ఆమె ఏ నాడు బయట ప్రచారంలోకి రాలేదు. ప్రోటోకాల్స్ విషయంలో తప్ప, భర్త పక్కన ఎప్పుడూ బయట కనిపించ లేదు. ఆమెను చూస్తే, తెలుగింట మనలో ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా భావించే ఆహార్యం ఆమెది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా రోడ్డుకు లాగారు నీచులు. ఇదేదో ఆవేశంతో అన్నారు అంటే, సరి పెట్టుకోవచ్చు. ఇది పని గట్టుకుని, గత నెల రోజులుగా జరుగుతున్న కుట్ర. ముందు వంశీతో అనిపించారు. నిన్న చంద్రబాబుని కుప్పంలో కొట్టాం, ఇంకేముంది చంద్రబాబుతో ఆడుకోవచ్చు అనుకుంటే, ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తారు. అంతే ఇక ఈయన్ను రాజకీయంగా కొట్టలేం అని, ఆయన భార్య అని భువనేశ్వరిని అసభ్యంగా దూషించటం మొదలు పెట్టారు. భరించారు, భరించారు భరించారు, చివరకు ఇంట్లో భార్యను ఇలా అసెంబ్లీలో ప్రజలు అందరూ చూస్తూ ఉండగా, ఆమె క్యారక్టర్ మీద కొడితే ఆయన భరించ లేక పోయారు.
మీడియా ముందు మాట్లాడుతూ, విలపించారు. చంద్రబాబుని అలా చూసిన చాలా మంది, బాధ పడ్డారు. ఈ రాజకీయాలు ఆయన వద్దు అనుకుంటే, ఎంత సేపు ? ఈ మాటలు పడటం ఎందుకు ? ఇవన్నీ ప్రజలు డిస్కస్ చేస్తూ ఉండగానే, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. తన ఆధ్వర్యంలో ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ చేత, పనులు పురామయించారు. ప్రజల వద్దకు పంపించారు. ప్రజల ఇబ్బందులు తీర్చమన్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరులో వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇబ్బందులు తెలుసుకున్న నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ని రంగంలోకి దించారు. ఇంకా ప్రజలు వరదలోనే ఉన్నారు కాబట్టి, వారికి కావలసిన ఆహరం పంపించారు. రాత్రి వరదలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఇక అంటు వ్యాధులు ప్రబలకుండా, కావాల్సిన మెటీరియల్ మొత్తం పంపించారు. వరద తగ్గగానే మరిన్ని కార్యక్రమాలు చేయటానికి రెడీ అయ్యారు. ఒక పక్క వైసీపీ నేతలు ఆమెను బజారుకు లాగితే, ఆమె మాత్రం, ఆమె చేయగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు.