సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ, చట్టాలు, వాటిని అమలు చేసే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వంలోని వ్యక్తులు, వివిధ రాజ్యాంగా సంస్థల మధ్య ఉండవలసిన సమన్వయం, ఇలా వివిధ అంశాల పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఏషియన్ లా ఇన్‌స్టిట్యూట్ 17వ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గున్న జస్టిస్, వివిధ అంశాల పై తన అభిప్రాయాలు తెలిపారు. మన ప్రజాస్వామ్యానికి, మన వ్యవస్థలకి అవినీతి అనేది ఒక చెదలా పట్టి పీడిస్తుందని అని అన్నారు. అవినీతి పరుల వల్ల, వ్యవస్థల పై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉందని జస్టిస్ రమణ అన్నారు. రాజ్యాంగం అనేది ఎంత మంచిది, సమర్దవంతమైనిది అయినప్పటికీ, దాన్ని అమలు చేసే వారు చెడ్డ వారు అయితే, అది ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని అన్నారు. అలాగే రాజ్యాంగం సమర్ధవంతంగా లేకపోయినా, దాన్ని అమలు చేసే వారు మంచివారు, సమర్ధులు అయితే, ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దేశంలో ఏ వ్యవస్థ అయినా, చట్టమైనా, న్యాయమైనా, రాజ్యాంగం ప్రకరామే నడవాలని అన్నారు. మన దేశ చట్టల్లోనే అంశాలను విబేధించి, దానికి బాష్యం చెప్పే వాళ్ళు ఉంటారని, తన సుదీర్ఘ ప్రస్థానంలో తెలుసుకున్నాని, దేశ సుస్థిరత మాత్రం, రాజ్యాంగంలోని న్యాయ సూత్రాలను పాటిస్తూ, విజయవంతంగా వాటిని పరిష్కరించంటం పైనే, ఉంటుందని అన్నారు.
అలాగే న్యాయం అనేది కేవలం, కోర్టులు మాత్రమే చేయవని, అన్ని రాజ్యాంగా సంస్థలు దానికి తోడ్పడాలని అన్నారు. న్యాయం చేసే అధికారం, రాజ్యాంగం సుప్రీం కోర్టుకు ఎలా ఇచ్చిందో, అలాగే రాజ్యానికి కూడా మంచి సమాజం ఏర్పాటు చేసే బాధ్యత ఇచ్చిందని అన్నారు. న్యాయం అంటే, ఈ దేశ ప్రజలకు, సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం చేయటమే అని, దీని కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. మంచి సమాజం కోసం ప్రభుత్వాలు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు. అలాగే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వివిధ అంశాల పై కూడా చర్చించారు. ముఖ్యంగా ఈ వైరస్ వచ్చిన తరువాత, మొత్తం స్వరూపమే మారిపోయిందని అన్నారు. అన్ని రంగాల్లో లాగే, న్యాయ రంగానికి ఈ వైరస్ వల్ల ఇబ్బందులు తప్పలేదని అన్నరు. ఈ వైరస్ వచ్చిన తరువాత, అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని, అలాగే పిల్లల చదువులకు కూడా ఇబ్బంది వచ్చిందని అన్నారు. వీటి అన్నిటి నుంచి, తొందరగా బయట పడాలని ఆకాంక్షించారు.