ఇది ప్రతి తెలుగు వారు గర్వ పడే సంఘటన. ఒకప్పుడు మన తెలుగు వారు పీవీ నరసింహారావు, ఈ దేశ ప్రధాని అయ్యి తెలుగు వారి సత్తా ఏమిటో చూపించారు. అలాగే, ఎన్టీఆర్, చంద్రబాబు, ఈ దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటారు. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాగే వివిధ రంగాల్లో మన తెలుగు వారు దేశంలోనే టాప్ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరో అత్యున్నత పదవిలో మన తెలుగు వారు కూర్చుంటున్నారు. ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానంలో, 48వ చీఫ్ జస్టిస్ గా, మన తెలుగు వారు, అదీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వారు అయిన, జస్టిస్ ఎన్వీ రమణ, పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జస్టిస్ కోకా సుబ్బారావు గారి తరువాత, మరో తెలుగు వాడు, చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 24 న ఆయన, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ, కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వానికి, లేఖ రాసారు. దీంతో ఈ దేశ చీఫ్ జస్టిస్ గా, ఒక తెలుగు వాడు, ఆ స్థానంలో కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి, ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణ పేరు ప్రతిపాదించటంతో, దీనికి సంబందించిన తదుపరి ప్రక్రియ, ఇక ప్రారంభం కానుంది.

nvramana 24032021 2

అయితే ఇక్కడ ఒక అంశం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఆరోపణలు, అప్పట్లో సంచలనంగా మారాయి. చీఫ్ జస్టిస్ కు జగన్ మోహన్ రెడ్డి కంప్లైంట్ చేయటం, కొంత మందితో రచ్చ రచ్చ చేయటం, ఇలా అనేక అంశాలు జరిగాయి. ఇవన్నీ జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా అడ్డుపడతాయని, వైసీపీకి అనుకూల మీడియా ప్రచారం చేసింది. అయితే వీటి అన్నిటి పై, అంతర్గత విచారణ జరిగిందని, అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణని తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదించటంతో, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ పరిగణలోకి తీసుకోలేదని అర్ధం అవుతుంది. ఆ ఆరోపణలు అన్నీ డిస్మిస్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 23వ తేదీతో, ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగుస్తుంది. తదుపరి చీఫ్ జస్టిస్ గా, జస్టిస్ ఎన్వీ రమణ, 24వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ వివాదాలు అన్నీ పక్కన పెడితే, ఇది ప్రతి తెలుగు వారికి గర్వ కారణం. ఇలాగే తెలుగు వారు, అన్ని రంగాల్లో ముందుండాలని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read