ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలక దేవాలయాల పై జరుగుతున్న ఘటనల పై స్పందించింది. మొన్నటి దాకా జరిగిన ఘటనల పై పోలీసులు విచారణలు జరుగుతున్నా పెద్దగా మార్పు రాకపోవటం, ఘటనలు రోజు రోజుకీ పెరుగుతూ ఉండటం, ప్రతిపక్షాలు, ప్రజలు నుంచి ఒత్తిడి రావటంతో, ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. నిన్న ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ జారీ చేసారు. అయితే ప్రభుత్వం చేస్తున్న పని మంచిదే అయినా, అందులో వాడిన భాష చూసి అందరూ అవాకయ్యారు. రాష్ట్రంలో వస్తున్నకొత్త సాంప్రదాయాలకు, ఇది ఒక మచ్చు తునకగా చెప్తున్నారు. సహజంగా రాజకీయ విమర్శల్లో వచ్చే వ్యాఖ్యలు, ఏకంగా ప్రభుత్వ అధికారులు విడుదల చేసే జీవో ల్లో కూడా వస్తున్నాయి అంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రోజు రోజుకీ ఎటు వెళ్తుందో అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే, ఇదే సాంప్రదాయం వాళ్ళు కూడా కొనసాగించి, ఇప్పుడు చేస్తున్న దానికి తిరిగి ఇస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇక ఈ జీవో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనల నేపధ్యంలో, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కమితీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, ఇది నిజంగా మంచి నిర్ణయమే. మత సామరస్యాన్ని కాపాడటానికి, ఈ చర్య ఎంతో కొంత ఉపయోగ పడుతుంది. ఇది ఎలా పని చేస్తుంది, ఇందులో సభ్యులను ఎలా తీసుకుంటారు అనేది పక్కన పెడితే, ఉద్దేశం మంచిదే.

velagapudi 08012021 2

అయితే ఇక్కడ వాడిన పదం మాత్రం అభ్యంతరం అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలసీ పెరాలసిస్ వచ్చింది అంటూ, ఆ జీవోలో రాసారు. అంటే అప్పటి ప్రభుత్వం, అసమర్ధత, అసహాయత అనే విధంగా పాలన చేసింది అని అర్ధం. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు కుంటుపడ్డాయని, మేము వచ్చిన తరువాత అద్భుతాలు చేస్తున్నాం అని రాసుకున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ జారీ చేసిన జీవోలో, "పాలసీ పెరాలసిస్" అంటూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయటం పై సీనియర్ బ్యూరోక్రాట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని హితువు పలుకుతున్నారు. తమ నిర్ణయం గొప్పది అని చెప్పటానికి, గతంలో పరిస్థితి ఇలా ఉంది అని చెప్పటం తప్పు లేదు కానీ, రాజకీయ పదాలు వాడటం అభ్యంతరం అని అంటున్నారు. గత ప్రభుత్వం చేతకానిది అని చెప్పేది, రాజకీయ నాయకులు అని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు అవి చూసుకుంటారని, రాజకీయ విమర్శలు చేసే స్థాయిలో సీనియర్ అధికారులు ఉంటే, ఈ సాంప్రదాయం మరింత పెచ్చుమీరితే, మంచిది కాదని అంటున్నారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ, అధికారులు తీరు మార్చుకోవాలని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read