ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో పామాయిల్‌ను కూడా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నగరంలోని కృష్ణలంక నెహ్రూనగర్‌లోని చౌకధరల దుకాణం (నెం.300)లో ఆదివారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 300వ నెంబర్ రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాసంతృప్తి స్థాయి 37మాత్రమే ఉండడంతో విచారించేందుకు ఆకస్మిక తనిఖీ చేశామని చెప్పారు.

cbn 13082018 2

డీలర్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ప్రజాపంపిణీలో జాప్యం జరిగిందని, అయితే సమయపాలన, సరుకుల పంపిణీ, ధరలు, తూకం వంటి అంశాల్లో కార్డుదారులను విచారించగా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి సామాజిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, ప్రజాపంపిణీ రంగంలో సంబంధం వున్న ప్రతిఒక్కరిలో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అన్నారు. కార్డుదారులకు సకాలంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని, ఈవిషయంలో అలసత్వం వహించినా, అవకతవకలకు పాల్పడినా డీలర్‌షిప్‌లను రద్దుచేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి పుల్లారావు హెచ్చరించారు.

cbn 13082018 3

ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు అక్టోబరు 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు రాగులు, జొన్నలను సరఫరా చేయనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో లీటల్‌ పామాయిల్‌ రూ.20 సబ్సీడీతో పామాయిల్‌ కూడా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని, ఈ విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. విలేజ్‌మాల్స్‌ ద్వారా తక్కువ ధరకే ని త్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రైవేట్‌ షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్స్‌తో ఆహార పదార్థాలు, పానీయాలు అమ్మకాలపై ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు విక్రయించే మాల్స్‌పై కఠినచర్యలు తప్పవని మంత్రి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read