రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకో బడిన ప్రభుత్వం గడువు జూన్ 8 వరకు ఉన్నా, అప్పటి వరకు ప్రభుత్వం పని చెయ్యకూడదు అంటూ, ఎన్నికల నిబంధనల సాకుతో ఢిల్లీ డ్రామా ఆడుతుంటే, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ, ముఖ్యమంత్రి, మంత్రులకు రోజుకి ఒక అవమానం కూడా జరుగుతుంది. ఢిల్లీ నుంచి ఎన్నుకోబండిన చీఫ్ సెక్రటరీ వచ్చి, ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఏ అధికారులు లేవు అని చెప్పారంటే, అతని వెనుక ఎవరు ఈ మాటలు మాట్లాదిస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక మంత్రికే తీవ్ర అవమానం జరిగిన తీరు చూస్తుంటే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధమవుతుంది. ఢిల్లీ వాళ్ళ ఎలా కక్ష తీర్చుకుంటున్నారో తెలుస్తుంది.
ఈ ఓజు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరువు, అకాల వర్షాలపై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పై వారం క్రితమే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికోసం ఉదయం 11 గంటలకు అధికారులకు సమాచారమిచ్చారు. అయినా అధికారులు మాత్రం సమీక్షకు హాజరుకాలేదు. మంత్రి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు సచివాలయంలోనే వేచి చూసినా అధికారులు మాత్రం హాజరుకాలేదు. కాగా వారం రోజుల క్రితమే తన శాఖలో సమీక్షలు చేస్తానని.. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తాము సమీక్షకు హాజరుకాలేమని వారు పరోక్షంగా సమాచారం పంపించారని తెలుస్తోంది. దీని వెనుక కొత్త చీఫ్ సెక్రటరీ ఒత్తిడి ఉన్నట్టు సమాచారం.
కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో... మంత్రి సోమిరెడ్డి సమీక్ష వివాదం దీనికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహించబోద్దని ఈసీ స్పష్టం చేయగా... వేరే రాష్ట్రాలు, కేంద్రంలో లేని నిబంధనలు ఇక్కడే ఎలా అమలు చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఓ అడుగు ముందుకేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... అధికారులు సమీక్షకు రాకపోతే తాను సుప్రీంకోర్టుకు వెళతానని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నిర్వహించిన సమీక్షకు అధికారులు, ఉద్యోగులు రాకపోవడంతో... ముందుగా ప్రకటించనట్టుగానే ఆయన దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళతారా, లేకపోతే ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.