ఏ రాష్ట్రమైనా ఈ రోజు ఉన్న దాని కంటే, రేపు బాగా ఉండాలని అనుకుంటుంది. దీన్నే అభివృద్ధి అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అభివృద్ధి అనేది మర్చిపోయి చాలా రోజులు అయ్యింది. ఈ రోజులా ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అయితే ప్రభుత్వ చర్యలు మాత్రం, ఈ రోజు కంటే ఘోరంగా 20 ఏళ్ళు వెనక్కు తీసుకుని వెళ్ళే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా దేశమంతా కరెంటు విషయంలో దూసుకుని పోతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం, రివర్స్ లో వెళ్తుంది. 20 ఏళ్ళ నాడు కరెంటు కోతలతో, ప్రజలు ఎలా ఇబ్బందులు పడేవారో, గత వారం రోజులుగా ఏపి పరిస్థితి అలా తయారయ్యింది. అయితే దీని పైన ఇన్నాళ్ళు బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొన్ని షాకింగ్ వాస్తవాలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమరాలకు పవర్ హాలిదీ ప్రకటించారు. 5 జిల్లాల్లో ఉన్న పరిశ్రమలకు వారానికి 2 రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇది అమలులో ఉంటుంది. రెండు వారల పాటు ఈ పవర్ హాలిడే ఉంటుంది. విద్యుత్ దొరికితే, అప్పుడు పవర్ హాలిదీ ఎత్తేస్తాం అని ప్రకటించారు. ఇక గృహాలకు ఇచ్చే కరెంటు విషయంలో ఏమవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read