‘ఒకప్పడు కేవలం రూ.200 పింఛను మాత్రమే వచ్చేది. అది కూడా నెలా నెలా వచ్చేది కాదు.. దీంతో బువ్వ కోసం సానా కట్టాలు పడ్డాల్సి వచ్చేదయ్యా.. మా బంగారం చంద్రబాబు వచ్చాక కట్టాలు తీరిపోయాయి. చంద్రబాబు చల్లగా ఉండాలి. ఆ బాబుకి నా బోటి వారందరి ఆశీస్సులూ ఉంటాయి. ఆయన చల్లగా ఉండాల’ని ఒక వృద్ధురాలు దీవెనలు అందించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు శనివారం కాజులూరు మండలం అయితపూడిలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఎదురైన ఓ వృద్ధురాలు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. పింఛను సొమ్మును వెయ్యి రూపాయలు చేసి వృద్ధుల కష్టాలను చాలా వరకు తీర్చేశారని, ఇప్పుడు రెండు వేలు చేయడంతో మరింత సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

bjp 25032019

‘సానా సంతోసంగా ఉందయ్యా.. నా ఓటు చంద్రబాబుకే. అదే పార్టీలో ఉన్న నీవు కూడా తప్పకుండా గెలుస్తావు’ అంటూ తోట త్రిమూర్తులు చేతులు ముద్దాడింది. ఆ వృద్ధారాలు ఆపి చెప్పిన మాటలకు, భావోద్వేగానికి గురయ్యారు తోట త్రిమూర్తులు. ఎన్టీఆర్‌ భరోసా పింఛను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రూ.75లను పేదలకు పింఛనుగా అందించారు. ఈయన స్ఫూర్తితో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన ఈనాలుగున్నరేళ్ల నుంచి వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.1000లు పింఛను, దివ్యాంగులకు నెలకు రూ.1,500లు ఇస్తూ వచ్చారు. ఇటీవల ఒంటరి మహిళలను గుర్తించి వారి కి నెలకు రూ.1000 అందిస్తున్నారు. ఎన్నికల్లో నెలకు వెయ్యి పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుస్తూ వచ్చారు.

bjp 25032019

సంక్రాంతి పండుగ ముందు సీఎం చంద్రబాబు పింఛను రెట్టింపు చేసి నిజమైన సంక్రాంతి చేసుకునేలా చేశారని ఆయనకు మాదీవెనలు ఎల్లప్పడూ ఉంటాయని లబ్ధిదారులు ప్రదర్శనలు చేస్తూ మళ్లీ ఆయన రావాలని కోరుకుంటున్నారు. ‘ఎంత భారమైనా ఫర్వాలేదు. నాకు కావాల్సింది పేదలు. అందుకే ఆలోచించా. ప్రతి నెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్నా. గత ఎన్నికల సమయంలో ఇంటికి పెద్ద కొడుకు మాదిరి ఉంటానని హామీ ఇచ్చా. అందుకే పింఛను మొత్తాన్ని పెంచా. ఇంకా ఎంతో చేయాలనుకున్నా. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మళ్లీ మీకు పంచుతా...’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read