దేశంలో మళ్ళీ కరోనా రూపు మార్చుకుని, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ తో దూసుకోస్తుంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 1,700కి చేరుకున్నాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 639 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 23 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 361, కేరళలో 156, గుజరాత్‍లో 136 కేసులు , తమిళనాడులో 121కేసులు, రాజస్థాన్ లో 120 , తెలంగాణలో 67, కర్ణాటకలో 64 , హరియాణాలో 63, ఒడిశాలో 37 ఒమిక్రాన్ కేసులు, బంగాల్‍లో 20, ఆంధ్రప్రదేశ్‍లో 17 కేసులు, మధ్యప్రదేశ్‍లో 9, యూపీ, ఉత్తరాఖండ్‍లో 8, చండీగఢ్, జమ్ముకశ్మీర్‍లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, పంజాబ్‍లో 1 ఒమిక్రాన్ కేసు నమోదయ్యాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తూ ఉండటంతో, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు కూడా ఈ రోజు నుంచి విర్చ్యువల్ విధానంలో కేసుల వాదనలు వినాలని నిర్ణయం తీసుకుంది. అనేక రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా విడుదల వాయిదా వేసుకున్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కోరుతున్నాయి.
మళ్ళీ ఇబ్బందులు తప్పవా ? నిన్న సినిమాలు వాయిదా, నేడు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం...
Advertisements