కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు శ్రీవారి ఆలయన్నే తమ ఆధీనంలోకి తీసుకుందామని అనుకుంటున్నారు. దీనికి బీజం వేసింది, మన స్వామి వారి మనకు కాకుండా చేసే ప్రయత్నం చేసింది, అప్పటి టిటిడి ఈఓ, ఐవైఆర్ కృష్ణా రావు... అవును, ఇప్పుడు రాష్ట్రం పై అనేక కుట్రలు, అమరావతి పై విషం చిమ్ముతున్న, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు... పవన్, జగన్, నెత్తిన పెట్టుకున్న ఐవైఆర్ కృష్ణా రావు... ఇదే ఐవైఆర్ కృష్ణా రావు, 2011లో, కేంద్ర పురావస్తుశాఖ వారికి ఉత్తరాలు రాసి, తిరుపతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.. రాష్ట్రానికి తిరుమల అవసరం లేదని, కేంద్రం ఆధీనంలో ఉంచుకోవాలని, ప్రతిపాదించారు.. అయితే, అప్పటిలో టిటిడి బోర్డ్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నది.
ఇప్పుడు ఈ మతోన్మాదులు సొంత, మతం వారిని కూడా వదలకుండా ఇలాంటి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఐవైఆర్ లాంటి వారి అప్పటి మాటలు నమ్మి, కేంద్రం తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకొంటానికి పన్నాగం పన్నింది.. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చిన అరగంటలోనే వెంకన్న తన పవర్ చూపించారు.. కేవలం అరగంటలో, కేంద్రం వెనక్కు తగ్గింది.. సమాచార లోపంతో ఉత్తర్వులు జారీ చేశామని.. ఈవో సింఘాల్ కు వివరణ ఇచ్చిన పురావస్తు శాఖ. ఆ వెంటనే ఆ ఆదేశాలు వెనక్కు తీసుకుంటున్నామని, మరో ఉత్తరం పంపించింది..
అయితే ప్రజాగ్రహానికి వెనక్కు తగ్గినా, మన వెంకన్నను మన నుంచి దూరం చేసి, వాళ్ళ చేతిల్లోకి తీసుకోవటానికి, ఒక డ్రామా ఆడించారు. ఆ డ్రామాలో పాత్రదారుడే రమణ దీక్షితులు.. అసలు శ్రీవారికి లేని పింక్ డైమెండ్ పోయింది అంటూ, ఒక ప్రచారం చేసారు... దీంతో బీజేపీ లిటిగేషన్ మనిషి రంగంలోకి దిగి, సుప్రీంలో కేసు వేస్తాను అని, రమణ దీక్షితులును తొలగించటం గురించి, నగలు పోవటం గురించి కేసు వేస్తాను అని చెప్పాడు.. కాని అవన్నీ అబద్ధాలే అని వాళ్ళకి తెలుసు.. అందుకే, ఇప్పుడు ముందు చెప్పిన వాటి పై కాకుండా, తిరుమలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు చేసి, కేంద్రానికి ఇవ్వాల్సిందిగా సుప్రీంలో కేసు వేస్తున్నాని, సుభ్రమణ్య స్వామి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. ఇలా కేసులు వేసి, మన వెంకన్న స్వామిని తన, హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలని, బీజేపీ పన్నాగం పన్నింది.. అయితే ఈ పరిణామాల పై, రాష్ట్ర ప్రజలు మండి పడుతున్నారు. మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ఆందోళనకు సిద్దమవుతున్నారు.. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి !!