అనంతపురం తాడిపత్రి మండలంచిన్నపొలమడలోని, ప్రబోధానంద ఆశ్రమంలో అధికారుల బృందం తనిఖీలు, విచారణ కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం చిన్నపొలమడలో ఉన్న ఆశ్రమాన్ని మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు అధికారులు శోధించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలను మాత్రం వెల్లడించలేదు. తనిఖీల్లో మరో 30 మంది ఆధార్‌కార్డులు లేకుండా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వారిని బయటకు తీసుకొచ్చి స్వస్థలాలకు పంపేశారు. ఈ క్రమంలో, ఈ రోజు మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

prabonadhana 200092018 2

ప్రబోధానంద స్వామి ఆశ్రమం చుట్టూ పోలీసులు కంచె వేయడం ప్రారంభించడంతో కొందరు భక్తులు రెచ్చిపోయారు. కంచె వేసేందుకు యత్నిస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఆశ్రమ వర్గీయులపై రాళ్లను విసిరారు. వీరికి స్థానిక మహిళలు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు కంచె వేసే పనిని కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆశ్రమం వద్దకు ప్రబోధానంద భక్తులు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘటనాస్థలానికి రావొద్దని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

prabonadhana 200092018 3

మరో పక్క, అనంతపురం జిల్లా గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ప్రబోధానంద స్వామిపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ తెదేపా నేత మధుసూదన్‌ గుప్తా ప్రబోధానందపై ఫిర్యాదు చేసి.. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు. చిన్నపొలమడ గ్రామం వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రబోధానందపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే తాజాగా గుత్తికి చెందిన తెదేపా నేత మధుసూదన్‌ బుధవారం ఆయనపై ఫిర్యాదు చేసి.. సీడీలు, పెన్‌డ్రైవ్‌లు సాక్ష్యాలుగా అందజేశారు. దీంతో పోలీసులు ఆయనపై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రబోధానంద ఎక్కడుంటారన్న దానిపై పోలీసుల వద్దా సమాచారం లేనట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read